రామ‌రాజు మెచ్చిన `శ్యామ్ సింగ రాయ్‌`

Update: 2022-01-09 03:40 GMT
నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా నాని బావించిన ఈ మూవీ గ‌త ఏడాది డిసెంబ‌ర్ 24న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. టాక్ ఎలా వున్నా ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి , మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్ లుగా న‌టించిన ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ స్టోరీగా రాహుల్ సంక్రిత్య‌న్ తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోవిడుద‌లైన ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

కోల్ క‌తా నేప‌థ్యంలో దేవ‌దాసీ వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా పోరాడిన శ్యామ్ సింగ రాయ్ అనే ఓ ఫిక్ష‌న‌ల్ క్యారెక్ట‌ర్ ని వెండితెర‌పై ఆవిష్క‌రించిన తీరు, టైటిల్ పాత్ర‌లో నేచుర‌ల్ స్టార్ నాని, దేవ‌దాసీగా సాయి ప‌ల్ల‌వి ప‌లికించిన అభిన‌యం ప్ర‌త ఈ ఒక్క‌రినీ క‌ట్టిప‌డేస్తోంది. దీంతో సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు ఈ మూవీపై, ఇందులో న‌టించిన న‌టీటులు నాని, సాయి ప‌ల్ల‌వి, కృతిశెట్టి , మ‌డోన్నా సెబాస్టియ‌న్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

తాజాగా ఈ జాబితాలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేరారు. ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా వీక్షించిన రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీపై., ఇందులో న‌టించిన న‌టీన‌టుల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అంతే కాకుండా హీరో నాని, హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌శ‌వంస‌లు కురిపించారు. మ‌న ఇండ‌స్ట్రీ నుంచి మ‌రో బ్రిలియంట్ ఫిల్మ్. `శ్యామ్ సింగ రాయ్‌` ఓ అద్భుత‌మైన అనుభూతినిచ్చింది. నాని, సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్‌. కృతిశెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ .. నిహారిక ఎంట‌ర్ టైన్‌మెంట్ కి టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ ` అని రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు.

చ‌ర‌ణ్ ట్వీట్ పై కృతిశెట్టి స్పందించింది. ఓ మై గాడ్ .. రామ్ చ‌ర‌ణ్ గారు.. థ్యాంక్యూ సో మ‌చ్ అంటూ ఫుల్ ఎగ్జైట్ అయింది. అయితే రామ్ చ‌ర‌ణ్ పెట్టిన ట్వీట్ ని గ‌మ‌నించిన మెగా అబిమానులు సాయి ప‌ల్ల‌వితో ఓ సినిమా చేయి అన్నా అంటూ త‌మ కోరిక‌ని బ‌య‌ట‌పెట్టారు. అంతే కాకుండా `ఆర్ ఆర్ ఆర్‌` కోసం ఎదురుచూస్తున్నామ‌న్నా అని కామెంట్ చేశారు.
Tags:    

Similar News