వీడియో: స్నేహితులు కుటుంబం ఎన్న‌టికీ త‌ర‌గ‌ని ఆస్తులు!

Update: 2022-06-19 05:30 GMT
స్నేహం .. ప్రేమ‌.. అనుబంధం .. వీటికి కొల‌మానం ఏమిటి? అంటే ఈ స్టార్ క‌పుల్ ని చూడాలి. ఇరువురి న‌డుమా సింక్ క‌పుల్ గోల్స్ ని సెట్ చేస్తుంటే.. సేవాగుణంతో ఆద‌ర్శ‌వంత‌మైన జీవ‌నం నిరంత‌రం అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతుంది. రామ్ చరణ్ - ఉపాసన కొణిదెల  జంట ప‌ద‌వ‌ వివాహ వార్షికోత్సవం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ జంట సెల‌బ్రేష‌న్ కి సంబంధించి ఇంత‌కుముందే కొన్ని ఫోటోలు విడుద‌లయ్యాయి. తాజాగా మ‌రో వీడియో గ్లింప్స్ వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని కొన్ని ఆస‌క్తిక‌ర ఫోటోలు ఇందులో ద‌ర్శ‌న‌మిచ్చాయి. ఇందులో విదేశీ విహార యాత్ర‌లో చెర్రోపాస‌న‌ చేయి చేయి కలిపి నడిచారు. ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ లో వివాహ వార్షికోత్సవ వేడుక నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ రివీల్ కాని అనేక గ్లింప్సీ ఫోటోలు వీడియ‌యోలను షేర్ చేసారు. ఈ వీడియోలో చెర్రీ-ఉపాస‌న‌తో పాటు వారి ప్రియాతి ప్రియమైన బంధుమిత్రులు ఉన్నారు.

ర‌క‌ర‌కాల మూవ్ మెంట్స్ ని కెమెరాలో క్యాప్చురైజ్ చేసి ఎంతో అంద‌మైన కొల్లేజ్ గా ఈ వీడియోని రూపొందించిన తీరు ఆక‌ట్టుకుంది. రామ్ చరణ్ - ఉపాసన చేయి చేయి కలిపి నడిచే ఫోటోలు ..  ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ ప్రేమ‌త‌న్మ‌యం ప్ర‌ద‌ర్శించ‌డం... ఇరువురూ ఎంతో అన్యోన్యంగా కుటుంబ స‌భ్యుల‌తో  స్నాప్ ల‌కు ఫోజులివ్వ‌డం వ‌గైరా వ‌గైరా ఫోటోలు ఆక‌ట్టుకున్నాయి. ఒక ఫోటోలో  ఉపాసన  మైక్ ని పట్టుకొని నవ్వుతున్నట్టు క‌నిపించింది. RRR సెట్లో ఫోటో ఇది. ఈ వార్షికోత్సవాన్ని కూడా ఫైర్ క్రాకర్స్‌తో జరుపుకోవడం ఒక ఫోటోలో కనిపించింది. వీడియోలోని మరో సెగ్మెంట్ లో రామ్ చరణ్ తన స్నేహితుల న‌డుమ‌ ఎంతో రాయ‌ల్ గా క‌నిపించారు. వైట్ ష‌ర్ట్..  బ్రౌన్ ప్యాంటు.. బ్రౌన్ షూస్ తో అత‌డు స‌రికొత్త లుక్ తో క‌నిపించాడు. ఉపాసన ఆకుపచ్చ దుస్తులలో క‌నిపించే ఫోటోగ్రాఫ్ చాలా అందంగా కనిపించింది.

``ఈ క్షణాలు.. పాఠాలు & సంబంధాలు ఎప్పటికీ.. ఆద‌రించే ప్రేమించే శ్రేయోభిలాషులు చుట్టూ ఉన్నందుకు.. మ‌నం నిజంగా అదృష్టవంతులం. చాలా సురక్షితమైన చోటును కలిగి ఉండటం సంతోషం. మా వార్షికోత్సవాన్ని చాలా ప్రత్యేకంగా చేసినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతతో ..`` అని ఉపాసన వీడియోను షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ అయ్యారు. నిజ‌మైన స్నేహం.. గొప్ప కుటుంబ‌ అనుబంధం .. జీవితంలో అంతులేని ఆనందం.. ఇవే అస‌లైన ఆస్తులు అని ఉపాస‌న త‌న మాట‌ల్లో చెప్ప‌క‌నే చెప్పారు.

https://twitter.com/upasanakonidela/status/1538082833989652480?s=24&t=sMZdoOmiIh4CjjirejWaqw

Tags:    

Similar News