ప్రభాస్ ని ఫాలో అవుతున్న చరణ్..?

Update: 2022-02-02 02:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' 'ఆచార్య' వంటి రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేసారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో #RC15 అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీని తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చరణ్ తన 16వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. డిఫెరెంట్ జోనర్స్ లో వేటికవే ప్రత్యేకంగా ఉండేలా కథలను ఎంచుకుంటూ మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నారు. చెర్రీ లైనప్ చూస్తుంటే డార్లింగ్ ప్రభాస్ ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' సినిమా తర్వాత వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ని కాపాడుకునేలా ప్రభాస్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. విభిన్నమైన జోనర్స్ లో వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. రామ్ చరణ్ కూడా 'ఆర్.ఆర్.ఆర్' మూవీ తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. దీంతో రాబోయే సినిమాలను కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్ చేస్తున్న 'ప్రాజెక్ట్ K' - చరణ్ చేయబోయే '#RC16' సినిమాలు సిమిలర్ సబ్జెక్టుతో తెరకెక్కనున్నాయనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించే చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ - సోషియో ఫాంటసీ జోనర్ లో తెరకెక్కిస్తున్నారని టాక్ ఉంది. భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో పాన్ వరల్డ్ మూవీగా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఇందులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ ఉంటుందని.. గౌతమ్ - చరణ్ కలిసి చేసే సినిమా కూడా అదే కాన్సెప్ట్‌ తో రాబోతున్నట్లు పుకార్లు పుట్టుకొచ్చాయి. ఒకే కాన్సెప్ట్‌ తో ఉన్నప్పటికీ ఎవరి విజన్‌ వాళ్ళకి ఉంటుందని అంటున్నారు.

రామ్ చరణ్ తో చేయబోయేది పాన్ ఇండియా మూవీ అని.. నిజానికి ఇది అంతకంటే పెద్దదని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేర్కొన్నారు. ఇదొక యాక్షన్ ఫిలిం అని స్పష్టం చేసారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రభాస్ సన్నిహితులు వంశీ - ప్రమోద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఇది డార్లింగ్ చేసే 'ప్రాజెక్ట్ కె' ను పోలి ఉంటే యూవీ టీమ్ బ్యాంక్ రోలింగ్ చేయడానికి ముందుకు రాకపోవచ్చు. సో #RC16 ఒక సరికొత్త సబ్జెక్టుతో రాబోతుందని చెప్పవచ్చు.
Tags:    

Similar News