మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఏపీ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపిన విషయం తెల్సిందే. ఆ సమయంలో రామ్ చరణ్ ను కాస్త పెద్దాయన వయసులో శంకర్ చూపించాడని.. ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఇప్పుడు సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను అమృత్‌సర్ లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వానీ ఇంకా వెన్నెల కిషోర్.. నవీన్ చంద్ర మరియు ప్రియదర్శిలు పాల్గొంటున్నారు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సన్నివేశాలను వీరిపై దర్శకుడు శంకర్ చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే ప్రారంభం అయిన ఈ షెడ్యూల్ ను ఏప్రిల్ మూడవ వారం వరకు నిర్వహించే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారం లో ఆచార్య సినిమా విడుదల కాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో రామ్ చరణ్ పాల్గొనేందుకు వస్తాడని సమాచారం అందుతోంది. ఈ లోపు అక్కడ జరపాల్సిన షూటింగ్ ను శరవేగంగా దర్శకుడు శంకర్ ముగించబోతున్నట్లుగా తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమా లో రామ్ చరణ్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా రామ్ చరణ్ కు సంబంధించిన లుక్ రివీల్ అయ్యింది. ముదురు వయసు లో పెద్దాయన లుక్ లో రామ్ చరణ్ సైకిల్ పై వెళ్తున్న ఫోటోలు అప్పుడు వైరల్ అయ్యాయి. అవి రామ్ చరణ్ వే అనే విషయంలో క్లారిటీ లేదు కాని అభిమానులు మాత్రం తెగ చర్చించుకున్నారు.
ఆ పాత్ర ఒకటి అయితే ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న దాని ప్రకారం చూస్తుంటే మరో పాత్ర స్టూడెంట్ అవుతుందని అంటున్నారు. రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తే ఖచ్చితంగా మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి కూడా భారీ భోనాంజ ఖాయం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ నుండి అతి పెద్ద సర్ ప్రైజ్ ఖాయం అంటూ అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ ఆ సినిమా లో అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం పడ్డ కష్టం ఏంటో అర్థం అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ ఇండియాస్ బిగ్గెస్ట్ దర్శకులు అయిన రాజమౌళి మరియు ఆ వెంటనే శంకర్ తో సినిమాలు చేసే అవకాశం రావడం అనేది ఖచ్చితంగా రామ్ చరణ్ అదృష్టంగా చెప్పుకోవచ్చు. వారిద్దరు కూడా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
వారిద్దరితో సినిమాలు చేయడం అనేది ప్రతి ఒక్క ఇండియన్ స్టార్ హీరో యొక్క కోరిక.. డ్రీమ్. అలాంటిది ఇద్దరితో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేసే అవకాశం రావడం చరణ్ అదృష్టం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే.