ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్ కి విశేషమైన ఆదరణ వస్తుంది. ఇక అంతర్జాతీయ స్థాయిలో కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న మొట్టమొదటి ఇండియన్ సాంగ్ గా నాటు నాటు గుర్తింపు సొంతం చేసుకుంది.
ఈ అవార్డు రావడంపై దేశం మొత్తం ప్రశంసలు కురిపించింది. ఇక ఈ సాంగ్ లో రామ్ చరణ్, తారక్ డాన్స్ పెర్ఫార్మెన్స్, కీరవాణి మ్యూజిక్, రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జీతో పాడిన విధానం అందరికి భాగా కనెక్ట్ అయ్యింది.
ఈ కారణంగానే సాంగ్ కి విశేషమైన ఆదరణ రావడంతో పాటు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ సాంగ్ కి కాలు కదుపుతున్నారు. ఇండియన్ మాస్ లో ఉండే ఊపు ఈ సాంగ్ లో ఉండటంతో తెలియకుండానే పాట వచ్చినప్పుడు స్టెప్పులు వేసేస్తూ ఉంటారు.
తాజాగా ఈ సాంగ్ కి రామ్ చరణ్ అత్త, ఉపాసన తల్లి శోభన కామినేని కాలు కదిపారు. దావోస్ బిజినెస్ సమ్మిట్ లో పాల్గొన్న ఆమె జర్నలిస్ట్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె కోరిక మేరకు నాటు నాటు పాటకి పాదం కదుపుతూ స్టెప్పులు వేయడం విశేషం. ఇది ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ గా మారింది.
తాను ఎక్కడికి వెళ్ళిన కూడా నాటు నాటు పాట గురించే అడుగుతున్నారని ఈ సందర్భంగా శోభన కామినేని తెలిపారు. అలాగే ఆ సాంగ్ లో రామ్ చరణ్ ఉండటం గర్వంగా ఫీల్ అవుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన తల్లి స్టెప్పులు వేసిన ఆ వీడియోని రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు.
దావోస్ లో అత్తగారు గర్వంగా ఫీల్ అయ్యే మూమెంట్ అంటూ ఉపాసన కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో కాస్తా వైరల్ అవుతుంది. ఇక మెగా ఫ్యాన్స్ తో పాటు, నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ సాంగ్ ని ప్రపంచ వ్యాప్తంగా కీర్తించడంపై గొప్పగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇక ఆస్కార్ కి అడుగుదూరంలో ఉన్న ఈ సాంగ్ ఆ అవార్డుని కూడా అందుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Video Here>> https://youtube.com/shorts/ES1uTCBiL9c?feature=share