హిందీలో సూపర్ హిట్ అయిన 'క్వీన్' కు దక్షిణాది బాషలలో విడివిడిగా రీమేక్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో 'దట్ ఈజ్ మహాలక్ష్మి' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తోంది. కాజల్ అగర్వాల్ లీడ్ లో నటిస్తున్న తమిళ రీమేక్ టైటిల్ 'ప్యారిస్ ప్యారిస్'. ఈమధ్యే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్లు రిలీజ్ అయ్యాయి.
తెలుగు ట్రైలర్ కు పెద్దగా స్పందన దక్కలేదు గానీ తమిళ ట్రైలర్ మాత్రం సంచలనం సృష్టించింది. ట్రైలర్లో మరో బ్యూటీ ఎల్లి అవ్రామ్ కాజల్ ను అసభ్యంగా పట్టుకోవడమే దానికి కారణం. ఈ సీన్ సినిమాకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది కానీ సంప్రదాయవాదులు మాత్రం కాజల్ పైన.. దర్శకుడు రమేష్ అరవింద్ పైన ఘాటుగా విమర్శలు గుప్పించారు. పబ్లిసిటీ కోసం దిగజారిపోయారని ఆరోపించారు. ఈ విమర్శలపై తాజాగా రమేష్ అరవింద్ స్పందిస్తూ ఆ సీన్ ను సమర్ధించుకున్నాడు.
హిందీలో కూడా ఆ సీన్ ఉందని ఆయన చెప్పాడు. ట్రైలర్ లో చూసినప్పుడు తప్పుగా అనిపించి ఉండొచ్చని.. ఆ సీన్ కు ముందు.. వెనుక వచ్చే సన్నివేశాలు చూస్తే ఆ సీన్ ఇంపార్టెన్స్ తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. ట్రైలర్ మాత్రమే చూసి విమర్శలు చేయడం సరికాదన్నాడు.

Watch Here: పవన్ కళ్యాణ్ పావలా అయితే నీ రేటు ఎంత..?