దివంగత దిలీప్ కుమార్ కు తెలుగు సినిమా పరిశ్రమతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలుగు లెజెండ్రీ స్టార్స్ నటించిన పలు సినిమా లను ఆయన హిందీలో రీమేక్ చేశారు. ఏయన్నార్ దేవదాస్ తో పాటు తెలుగు లో ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేసిన రాముడు భీముడు సినిమాను కూడా ఆయన హిందీలో డబ్బింగ్ చేశారు. తెలుగు లో రాముడు భీముడు సినిమాను నిర్మించిన నాగిరెడ్డి హిందీలో దిలీప్ తో మాత్రమే చేయాలని భావించాడు. అందుకు ఆయన్ను ఒప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఆ సమయంలోనే సైరా బానును పెళ్లి చేసుకున్న దిలీప్ కుమార్ నెల రోజుల హనీ మూన్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో రాముడు భీముడు రీమేక్ ను నాగిరెడ్డి ఆయన వద్దకు తీసుకు వెళ్లారు.
సినిమా నచ్చడంతో పాటు నాగిరెడ్డి రిక్వెస్ట్ కారణంగా దిలీప్ కుమార్ ఆ సినిమాను రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడు. అప్పట్లో బాలీవుడ్ లో ది బెస్ట్ యాక్టర్‌గ ఆ దిలీప్ కుమార్ దూసుకు పోతున్నారు. అలాంటి సమయంలో ఆయన రీమేక్ చేసేందుకు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. కాని ఆయన నాగిరెడ్డి మాట కాదనలేక రీమేక్ కు సిద్దం అయ్యారు. టైటిల్ గా రామ్ ఔర్ శ్యామ్ అని ఖరారు చేశారు. చెన్నైలో షూటింగ్ మొత్తంను నిర్వహించారు. ఆ సమయంలో హోటల్ రూమ్ ను ఏర్పాటు చేయకుండా కొత్తగా పెళ్లి అయిన జంట కనుక ఒక భారీ బంగ్లాను ప్రత్యేకంగా వారి కోసం రెడీ చేయించారు.
దిలీప్ కుమార్ మరియు సైరా బాను ఆ బంగ్లాలో ఏకాంతంగా గడిపేందుకు అన్ని వసతులు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఒక రూమ్ ను ఏర్పాటు చేసి అందులో ఏసీ పెట్టించి మరీ వారి కోసం ఏర్పాట్లు చేశారు. అప్పటి వారు చెప్పేదాని ప్రకారం దిలీప్ కుమార్ సైరా బానులు ఉన్నన్ని రోజులు ఆ రూమ్ ను ప్రతి రోజు కూడా పూలతో అలంకరించి శోభనం గదిలా తయారు చేసే వారట. ఇక నాగిరెడ్డి తనయుడు ప్రసాద్ ఇంటి నుండే ప్రతి రోజు వారికి వింధు భోజనం వెళ్లేదట. దిలీప్ కుమార్ ను అంతగా నాగిరెడ్డి వారు చూసుకోవడం వల్లే ఎన్నో సార్లు ఆ విషయాన్ని ఆయన చెప్పేవారట.