వెటరన్ నటి రమ్యకృష్ణ సెకెండ్ ఇన్నింగ్స్ ని దున్నేస్తోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల చిత్రాల్లో కీలక పాత్ర లు దక్కించుకుంటూ అక్కడా తనదైన మార్క్ అప్పిరియన్స్ తో అదరగొడుతున్నారు. ఇటీవలే లైగర్ లో `సాలా క్రాస్ బ్రీడ్` అంటూ తనదైన మాస్ అప్పిరియన్స్ తో రప్ఫాడించేసారు. అంతకుముందు `బంగార్రాజు`లో సత్యభామగా అలరించారు.
ఈరెండిటికంటే ముందు `నా మాటే శాసనం` అంటూ బాహుబలితో పాన్ ఇండియానే శాసించారు. ప్రస్తుతం `రంగమార్తాండ`లోనూ కీలక పాత్ర పోసిస్తున్నారు. ఇంకా కొన్ని చిత్రాలు సెట్స్ లో ఉన్నాయి. ఇలా 300 చిత్రాల్లో నటించని అనుభవాన్ని రంగరించి కొత్త ప్రాజెక్ట్ ల్లో ఛాన్సులు అందుకుంటున్నారు.
అలా వెండి తెరను దున్నేస్తూ..మరోవైపు బుల్లి తెరపైనా హోస్ట్ గా మెరుస్తున్నారు. ఆహా ఓటీటీలో లో ప్రసారం అవుతోన్న డాన్స్ ఐకాన్ షోని హోస్ట్ చేస్తున్నారు. ఈ షో పెద్ద సక్సెస్ అయింది. చూసే అభిమానులు డే బై డే పెరుగుతున్నారు. అప్పుడప్పుడు తనదైన శైలిలో స్టెప్పులేసి నీలీంబరి మురిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా `సయ్యా సయ్యారే` అంటూ తాను చేసిన ఓ స్పెషల్ సాంగ్ వెనుక సీక్రెట్‌ను లీక్ చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన `నా అల్లుడు` సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ల మదర్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో `సయ్యా సయ్యారే` అనే పాటకు రమ్య స్టెప్పులేసారు. అదే పాటకు డ్యాన్స్ ఐకాన్ షోలో ఓ కంటెస్టెంట్ డ్యాన్స్ చేయగా.. రమ్యకృష్ణ నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.
ఆ సాంగ్ చేసేటప్పుడు తాను నాలుగు నెలల ప్రెగ్నెంట్ అన్న విషయాన్నిరమ్యకృష్ణ రివీల్ చేసారు. అందుకే ఈ పాట నాకు చాలా స్పెషల్` అని చెప్పుకొచ్చారు.
దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. నాలుగు నెలల గర్భంతో డాన్సు చేయడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ తారక్ లాంటి ఎనర్జిటిక్ డ్యాన్సర్ తో స్టెప్ అందుకోవడం అంటే గట్స్ ఉండాలి. అవన్నీ తనలో ఉన్నాయని రమ్యకృష్ణ మరోసారి నిరూపించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.