టాలీవుడ్ లో ముప్ఫై ఏళ్లకు పైగా యాక్టింగ్ చేస్తోంది రమ్యకృష్ణ. సాధారణ నటి నుంచి స్టార్ హీరోయిన్ వరకూ వెలిగిపోయింది రమ్యకృష్ణ. 80ల నుంచి సత్తా చాటుతున్న ఈ నటి.. ఇప్పుడు కెరీర్ లో నే పీక్ స్టేజ్ లో ఉన్నానని అంటోంది. తాజాగా సాధించిన రెండు బ్లాక్ బస్టర్స్.. ఈమె ట్యాలెంట్ కి అద్దం పట్టాయి.
బాహుబలిలో శివగామి పాత్ర - సోగ్గాడే చిన్ని నాయనలో.. నాగార్జునకు భార్యగాను - అమ్మగాను ఒదిగిపోయిన తీరు అద్భుతం అనాల్సిందే. హీరోయిన్లు - మరదళ్లు చాలామంది ఉన్నా.. రమ్య చుట్టూనే సినిమాతో పాటు సన్నివేశాలు కూడా తిరిగాయంటే.. రమ్యకృష్ణ ప్రతిభ అర్ధమవుతుంది. ఇప్పుడు రాబోతున్న ఆఫర్స్ కూడా ఈమెను మరింతగా పైకి ఎక్కించేవిగానే ఉన్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్ సరసన ఆఫర్ దక్కించుకోవడమంటే మామూలు విషయం కాదు. పంచతంత్రం తర్వాత మరోసారి కమల్ సరసన ఆఫర్ దక్కించుకుంది రమ్యకృష్ణ.
'కమల్ సార్ కాల్ చేశాను నేను వెంటనే ఒప్పుకున్నాను. ఆ టైంలో నేను అంతకంటే చెప్పగలిగేది ఏముంటుంది. మరోసారి కాలేజ్ రోజుల్లోకి వెళుతున్నంత ఫీలింగ్ కలిగింది. కమల్ తో కలిసి నటించడమంటే.. రోజు ఎంతోకొంత నేర్చుకుంటూ ఉండడమే' అని చెప్పింది రమ్యకృష్ణ. పూర్తిగా అమెరికాలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈమూవీలో శృతిహాసన్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇది తన సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవడం లేదని.. మొత్తం తన కెరీర్ లోకే బెస్ట్ స్టేజ్ ఇప్పుడు నడుస్తోందని రమ్యకృష్ణ చెబుతుండడం విశేషం.