45 వయస్సులోనూ సూపర్‌ హాటండీ

Update: 2016-01-22 03:30 GMT
మన హీరోయిన్లు సాధారణంగా అవుట్‌ ఆఫ్‌ ఫోకస్‌ అవ్వగానే గ్లామర్‌ అనే గుణాన్ని కోల్పోతూ ఉంటారు. బాలీవుడ్‌ లో అయితే 40 ప్లస్‌ బ్యూటీలందరూ బాగానే మెయిన్‌ టైన్‌ చేస్తుంటారు కాని.. టాలీవుడ్‌ లో మాత్రం అవుటాఫ్‌ షేప్‌ అయిపోతున్నారంతే. కాని ఒక్క హీరోయిన్‌ మాత్రం అందరికీ చుక్కలు చూపించేస్తోంది.

మొన్ననే బాహుబలిలో శివగామిగా ఇరగదీసింది. తరువాతేమో సోగ్గాడి చిన్ని నాయన సినిమాలో సోగ్గాడి పెళ్ళాంగా అదరగొట్టేసింది. వయస్సు 45 టచ్‌ అయినా కూడా ఇంకా తనలోని గ్లామర్‌ యాంగిల్‌ కూడా అలాగే ఉందని ప్రూవ్‌ చేస్తోంది తమిళ చిన్నది రమ్య కృష్ణన్‌ ఎలియాస్‌ రమ్యకృష్ణ. అమ్మడు తెలుగులో 90వ దశకంలో ఒక సూపర్‌ స్టార్‌ గా వెలిగిపోయింది. బడా హీరోలందరికీ రమ్యనే మెయిన్ ఆప్షన్‌. గ్లామర్‌ క్వీన్ అంటే ఆమే. అలాంటి రమ్య ఇప్పుడు కూడా సేమ్‌ టు సేమ్‌ గ్లామర్‌ తో రఫ్ఫాడిస్తోంది.

అక్కడ చూస్తున్నారు.. ప్రొవోగ్‌ అనే మ్యాగజైన్‌ కోసం అమ్మడుఫోజులిచ్చింది. స్లీవ్ లెస్‌ టాప్‌ లో.. లాంగ్ స్కర్టులో.. మతి పోగొట్టేసిందంతే. ఏదేమైనా రమ్యలోని ఆ వగలు సెగలు ఇంకా తగ్గలేదు సుమండీ. సూపర్‌ హాటుగా ఉందండీ.
Tags:    

Similar News