సహజంగా మన ఫిలిం ఇండస్ట్రీ హీరో చుట్టూ తిరుగుతుంది. స్టొరీ - బడ్జెట్ - పబ్లిసిటీ ఏదైనా కానివ్వండి అంతా హీరోజపమే. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు లేదంటే ఏదో ఒకరి అరా కంటెంట్ బేస్డ్ సినిమాలు తప్ప మిగతా అంతా హీరో జపమే. కానీ మారుతి డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'శైలజా రెడ్డి అల్లుడు' టీమ్ మాత్రం అలాకాకుండా అత్త మంత్రం జపిస్తున్నారు.
ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకమైన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అసలు టైటిల్ లోనే శైలజా రెడ్డి అంటూ రమ్య కృష్ణ పాత్ర పవర్ఫుల్ అని హింట్ ఇచ్చారు. అంతే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్లలో కూడా రమ్యకృష్ణ ఉంది.. ఈమధ్య కొత్తగా రమ్యకృష్ణ మీదే ఓ పోస్టర్ రిలీజ్ చేయడం మరో విశేషం. హీరోతో పాటు అత్త క్యారెక్టర్ కు పబ్లిసిటీలో ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం మారుతి ప్లానింగేనట. చైతుకు ఉండే రెగ్యులర్ ఆడియన్స్ ఎలాగూ ఉంటారు.. దాంతో పాటు రమ్యకృష్ణ ను స్ట్రాంగ్ గా ప్రొజెక్ట్ చేస్తే ఫ్యామిలీ ప్రేక్షకులను మరింతగా ఆకర్షించవచ్చని ఇలా చేస్తున్నారట.
రమ్యకృష్ణ కెరీర్లో 'నీలాంబరి'.. 'శివగామి' లాంటి మరపురాని పాత్రలున్నాయి.. సో రమ్యకృష్ణకు మరో స్ట్రాంగ్ క్యారెక్టర్ అని హింట్ ఇస్తున్నారన్నమాట. సరైన రోల్ ఉంటే రమ్యకృష్ణ చెలరేగిపోతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ అల్లుడు ఆ మొండిఘటమైన అత్తపై ఎలా పై చేయిసాధిస్తాడో?