కథానాయికగా 90ల్లో ఒక వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. ఐతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక ఆమెకు ఏమంత మంచి గుర్తింపు రాలేదు. పెద్ద అవకాశాలు కూడా ఏమీ రాలేదు. కానీ ‘బాహుబలి’ సినిమాతో ఆమె దశ తిరిగిపోయింది. ఎవరో చేయాల్సిన పాత్ర ఆమెను వరించింది. ఆ పాత్రకు ఆమె అద్భుతంగా న్యాయం చేసి దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు సంపాదించింది. దీంతో రమ్యకృష్ణ రేంజే మారిపోయింది. పలు భాషల్లో పెద్ద పెద్ద అవకాశాలు ఆమెను వరించాయి. దీంతో డిమాండ్ పెరిగి.. భారీగా పారితోషకం తీసుకుంటోంది రమ్య. ప్రస్తుతం తెలుుగులో రమ్యకృష్ణ నటిస్తున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాకు ఆమె తీసుకున్న పారితోషకం ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఏక మొత్తంగా పారితోషకం అని కాకుండా రోజుకు ఇంత అని పారితోషకం తీసుకుంటోందట రమ్య.
మరి ఆమె రోజుకు ఎంత తీసుకుంటుందో తెలుసా? అక్షరాలా రూ.6 లక్షలు. దక్షిణాది ఒక్క రోజుకు ఇంత మొత్తం తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టు ఇంకెవరూ లేరు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కోసం ఆమె 25 రోజులు కాల్ షీట్లు ఇచ్చిందట. ఈ లెక్కన ఆమె ఆ చిత్రానికి రూ.1.5 కోట్లు పారితోషకం తీసుకుంటున్నట్లు లెక్క. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న అను ఇమ్మాన్యుయెల్ కు ఇందులో సగం కూడా పారితోషకంగా ఇవ్వట్లేదని సమాచారం. తెలుగులో ప్రస్తుతం ఏ స్టార్ హీరోయిన్ కూడా సినిమాకు కోటిన్నర పారితోషకం అందుకోవడం లేదు. దీన్ని బట్టి రమ్యకృష్ణ డిమాండ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఐతే తన పాత్రలో సినిమాలకు రమ్యకృష్ణ తెస్తున్న వెయిట్ ను బట్టి చూస్తే ఆమెకు ఇంత పారితోషకం ఇవ్వడంలో తప్పులేదని అంటున్నారు. హీరోలు ఐదు.. పది.. 15.. 20 కోట్లు పారితోషకాలు తీసుకుంటున్నపుడు ఆమెకు కోటిన్నర ఇవ్వడంలో తప్పేముంది?