సినిమాలకన్నా.. వ్యక్తిగత జీవితంలోని వివాదాలతోనే గుర్తింపు తెచ్చుకున్న నటి ‘వనితా విజయ్ కుమార్’. తన కుటుంబ సభ్యులు తనను వెలివేశారంటూ పలుమార్లు మీడియా ఎదుట వాపోయిన వనితా.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే.. ఈ సారి సహనటి, టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణపై పరోక్షంగా విమర్శలు చేశారు.
వ్యక్తిగత కారణాలతో నటనకు చాలాకాలం దూరంగా ఉన్న ఆమె.. ‘బిగ్ బాస్ జోడిగల్’ రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. అయితే.. ఆ షో నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అనంతరం కాస్టింగౌ కౌచ్, వేధింపులు వంటి అంశాలపై వరుస ట్వీట్లు చేసిన వనితా.. ఓ సీనియర్ నటివల్లనే తాను షో నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆ షోకు రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. పైగా.. ఆ షోలో సీనియర్ కూడా మెనే. దీంతో.. రమ్యకృష్ణను ఉద్దేశించే వనితా విజయ్ కుమార్ కామెంట్ చేసిందనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఈ విషయాన్ని మీడియా రమ్యకృష్ణ వద్ద ప్రస్తావించగా.. ‘‘షోలో ఏం జరిగిందనే విషయాన్ని కూడా మీరు ఆమెను అడిగి ఉంటే బాగుండేది. నాకు సంబంధించినంత వరకు ఇదేం పెద్ద విషయం కాదు. నో కామెంట్స్’’ అని ఆన్సర్ ఇచ్చారు. గత ఎపిసోడ్ లో వనితా పెర్ఫార్మెన్స్ కు పది మార్కులకు గానూ ఒకే ఒక మార్కు ఇచ్చారు రమ్యకృష్ణ. ఈ కారణంగానే వివాదం మొదలై ఉండొచ్చని అనుకుంటున్నారు.
కాగా.. వనితా విజయ్ కుమార్ జీవితంలో మెజారిటీ షేర్ వివాదలదే. ఇప్పటి వరకు ఆమె మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ విషయంలో ఎంతో మంది ఎన్నోవిధాలుగా ఆమెను విమర్శించారు. అయితే.. అందరికీ తనదైన రీతిలో సమాధానం చెబుతూ వచ్చారు. సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిగత జీవితంలోని కష్టనష్టాల గురించి పలుమార్లు చెప్పుకొచ్చారు.
తనకు జీవితం అంటే ఏంటో తెలియని 18 ఏళ్ల వయసులో పెళ్లి చేశారని చెప్పారు వనితా. ఈ క్రమంలో తన భర్తతో ఎన్నోసార్లు గొడవలు జరిగాయని, దీంతో తాను మానసికంగా కుంగిపోయానని చెప్పారు. చివరకు చేసేదేమీ లేక తాను విడాకులు తీసుకున్నట్టు చెప్పారు. అయితే.. తాను విడాకులు తీసుకోవడం తన తల్లిదండ్రులకు నచ్చలేదని చెప్పారు. తన వల్ల వారి పరువు పోతుందని ఇంట్లోనుంచి గెంటేశారని పలుమార్లు చెప్పారు వనిత. అయితే.. జీవితంలో తగిలిన ఎదురు దెబ్బల వల్లనే ఎన్నో విషయాలు తెలుసుకున్నానని కూడా చెప్పారు.