ఆహా లో 'డ్యాన్స్ ఐకాన్'.. జడ్జిగా సీనియర్ నటి..!

Update: 2022-09-06 00:30 GMT
100 శాతం తెలుగు కంటెంట్ ను అందించడమే లక్ష్యంగా డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 'ఆహా'.. దిగ్గజ ఓటీటీలకు ధీటుగా దూసుకుపోతోంది. వీక్షకులకు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను అందించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బ్లాక్ బస్టర్ సినిమాలు - ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లతో పాటుగా టాక్ షోలు - గేమ్ షోలకు కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది.

అలానే ప్రతిభావంతులను ఎంకరేజ్ చేసే ఉద్దేశ్యంతో 'తెలుగు ఇండియన్ ఐడల్' పేరుతో సింగింగ్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ ను నిర్వహించింది 'ఆహా'. ఈ క్రమంలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా వీక్షకులను ఉర్రూతలూగించే ''డ్యాన్స్ ఐకాన్'' అనే సరికొత్త డ్యాన్స్ షోతో అలరించడానికి రాబోతోంది.

'డ్యాన్స్ ఐకాన్' కార్యక్రమానికి ఓంకార్ హోస్టుగా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 11న సాయంత్రం 6 గంటల నుంచి ఈ షో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. గ్రాండ్ గాలా లాంచ్ ఎంత భారీగా ఉంటుందో తెలిపేందుకు నిర్వాహకులు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో అందరినీ ఆకర్షిస్తోంది.

'డ్యాన్స్ ఐకాన్' షోకి సీనియర్ నటి రమ్యకృష్ణ జడ్జిగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే 'క్వీన్' వెబ్ సిరీస్ తో ఓటీటీలో అరంగేట్రం చేసిన శివగామి.. ఇప్పుడు ఆహా డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా రాబోతోంది. ఆమెతో పాటుగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా జడ్జిగా ఉంటారు.

ఈ డ్యాన్స్ షోలో మొత్తం 12 మంది కంటెస్టెంట్స్ ఉండనున్నారు. వీరిని వేలం ద్వారా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ కొనుగోలు చేయనున్నారు. గీతా ఆర్ట్స్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర - పీపుల్ మీడియా ఫ్యాక్టరీ - మైత్రీ మూవీ మేకర్స్ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు ఇద్దరిద్దరు కంటెస్టెంట్స్ ‏ను తీసుకుంటారు.

వీరికి శ్రీముఖి - యష్ మాస్టర్ - మోనాల్ గజ్జర్ కో ఓనర్స్ గా మెంటర్స్ గా ఉండనున్నారు. 12 మంది కంటెస్టెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కో కొరియోగ్రాఫర్ ఉంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే.. గెలిచిన కంటెస్టెంట్ తరపు కొరియోగ్రాఫర్ కు టాలీవుడ్ స్టార్ హీరోకు డాన్స్ కొరియోగ్రఫీ చేసే అవకాశం కల్పించనున్నారు.

సెప్టెంబర్ 11న ప్రారంభమయ్యే 'డ్యాన్స్ ఐకాన్' ఫస్ట్ ఎపిసోడ్ లో 'లైగర్' జోడీ విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే గెస్టులుగా సందడి చేయనున్నారు. అలానే అల్లు అరవింద్ - మైత్రీ రవి శంకర్ సహా మిగిలిన నాలుగు ప్రొడక్షన్ హౌస్ ప్రతినిధులు హాజరయ్యారు.

'డ్యాన్స్ ఐకాన్' షో వర్ధమాన, ప్రతిభావంతులైన కొరియోగ్రాఫర్లు మరియు డ్యాన్సర్లకు తమ టాలెంట్ ను నిరూపించుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది. ఈ నెల 11 సాయంత్రం 6 గంటలకు 'ఆహా' ఓటీటీలో గ్రాండ్ గాలా లాంచింగ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుండగా.. సెప్టెంబర్ 17 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు రెగ్యులర్ ఎపిసోడ్స్ ప్రసారం కానున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News