రమ్య.. మళ్లీ స్పందనలు కలిగిస్తోందే!!

Update: 2016-08-16 03:35 GMT
శాండల్ వుడ్ హీరోయిన్ రమ్య అలియాస్ దివ్య స్పందన.. అప్పట్లో హాట్ హాట్ హీరోయిన్. కన్నడలో ఈమె ఇమేజ్ తారా స్థాయిలో ఉండేది. ఎలాంటి రోల్స్ కయినా కేరాఫ్ అడ్రస్ రమ్యనే. అయితే.. 2011లో రాజకీయాల్లో అడుగుపెట్టి కాంగ్రెస్ లో చేరిపోయింది. అప్పుడు కూడా బాగానే హాటీ వేషాలు వేసిన ఈమె.. 2013లో ఏకంగా ఎంపీ అయిపోయింది. తను ఎంతో క్రేజీ హీరోయిన్ అయినా.. అసలు మేకప్ లేకుండా కాటన్ చీరల్లో పార్లమెంట్ లో తిరిగేయడం ఓ సంచలనం. ఆ పదవి ఏడాది తర్వాత చేజారిపోయింది.

ఎంపీగా ఎన్నికైన సమయంలో ఈమె సైన్ చేసిన సినిమాలు 3-4 పూర్తి కావాల్సి ఉండగా.. వాటికి డేట్స్ ఇచ్చేందుకు.. ఇచ్చిన వాటిలో హాట్ గా నటించేందుకు పట్టపగలే అందరికీ చుక్కలు చూపించేసింది. ఇక ఆ మూవీస్ పని అంతే అనుకుంటున్న టైమ్ లో.. ఇప్పుడు నాగహరవు(తెలుగు నాగాభరణం)మూవీలో మళ్లీ హాట్ గా మెరిసిపోయింది. మ్యూజిక్ రిలీజ్ అంటూ ఇచ్చిన టీజర్ లోనే చాలా సంగతులు చెప్పేసింది రమ్య.

అప్పుడు అంతగా వేధించి.. ఇప్పుడు మళ్లీ హాట్ రోల్స్ చేయడానికి ఇండస్ట్రీలో చాలానే కారణాలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్స్ కి ఇంకా మూడేళ్లు టైమ్ ఉండడం.. ఓసారి ఓడాక ఈసారైనా గెలుస్తాననే నమ్మకాలు లేకపోవడంతో.. మళ్లీ ఇమేజ్ ను పెంచుకునేందుకు వేసిన ఎత్తుగడగా చెబుతున్నారు. అయితే.. ఈ 33 ఏళ్ల హీరోయిన్ ని హాట్ హాట్ గా చూసేందుకు కన్నడ జనాలు బాగానే ఇంట్రస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది.
Full View

Tags:    

Similar News