‘బాహుబలి’ సినిమాలో ప్రతి పాత్రా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నదే. ఈ పాత్రకు వీళ్లే కరెక్ట్ అనిపించేలా కాస్టింగ్ విషయంలో నటీనటుల్ని జాగ్రత్తగా ఎంచుకున్నాడు రాజమౌళి. ఐతే ఈ సినిమాలో భల్లాలదేవుడిగా అదరగొట్టిన రానా దగ్గుబాటి మాత్రం ఈ సినిమాలో ప్రధాన పాత్రలకు తన ఛాయిస్ వేరే అంటున్నాడు. యాంకర్ ప్రదీప్ నిర్వహించే ఒక టాక్ షోకు అతిథిగా హాజరైన రానా.. ఒకవేళ ‘బాహుబలి’కి మీరు దర్శకుడైతే ఏ పాత్రకు ఎవరిని ఎంచుకుంటారు అని అడిగితే.. ఆసక్తికర సమాధానం ఇచ్చాడు రానా. తాను పోషించిన భల్లాల దేవుడి పాత్రను జూనియర్ ఎన్టీఆర్ కు ఇస్తానన్న రానా.. బాహుబలి పాత్రకు బాలయ్య పేరు సూచించడం విశేషం.
‘‘పౌరాణిక.. జానపద పాత్రలు చేయడంలో దిట్ట అయిన బాలకృష్ణ గారు బాహుబలి పాత్ర చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రస్తుత తరంలో ఉత్తమ నటుడైన ఎన్టీఆర్ ను భల్లాల దేవగా చూడాలనుకుంటా’’ అని రానా తెలిపాడు. ఐతే శివగామి పాత్రకు మాత్రం మరో ఛాయిస్ లేదని.. ఆ పాత్రను రమ్యకృష్ణే చేయాలని రానా అభిప్రాయపడటం విశేషం. రానా ఏదో తమాషాకు అన్నప్పటికీ.. బాహుబలిగా బాలయ్య.. భల్లాలదేవుడిగా ఎన్టీఆర్ నటిస్తూ.. ఒకరితో ఒకరు తలపడితే ఆ మజానే వేరుంటుందనడంలో సందేహం లేదు. వినడానికే చాలా ఎగ్జైటింగ్ గా ఉన్న ఈ కాంబినేషన్ ఇంకో రకంగా అయినా తెరమీదికి వస్తుందేమో.. బాబాయి-అబ్బాయి కలిసి ఒక సినిమా చేస్తారేమో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/