నితిన్.. నువ్వు మారవా - రానా

Update: 2015-08-24 11:42 GMT
కొరియర్ బాయ్ కళ్యాణ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో దగ్గుబాటి రానా నవ్వులు పండించాడు. నితిన్ నటించిన జయం సినిమా రోజుల్ని అతను గుర్తుకు తెచ్చుకున్నాడు. ‘‘2002లో నేను టెన్త్ క్లాస్ పాసవుతానా లేదా అని టెన్షన్ పడుతున్న రోజుల్లో జయం సినిమా వచ్చింది. అప్పటి నేను కూడా యంగ్ గా, నాజూగ్గా ఉండేవాణ్ని. కానీ ఇప్పుడు ఇలా బాడీ పెంచేసి, గడ్డాలు పెంచేసి కనిపిస్తున్నా. కానీ నితిన్ మాత్రం ఏం మారలేదు. అప్పుడున్నట్లే ఇప్పుడు కూడా టీనేజర్ లా ఉన్నాడు. చిరంజీవి గారు 60వ పుట్టిన రోజు చేసుకున్నారు.  నితిన్ కూడా అలాగే  చేసుకుని.. అప్పటికి కూడా లవ్ స్టోరీలు చేస్తుంటాడేమో. గౌతమ్ మీనన్ నాకిష్టమైన డైరెక్టర్. కానీ ఓ కంప్లైంట్ ఏంటంటే.. ఆయన కథలన్నీ నాకు చెబుతాడు. సినిమాలు వేరే వాళ్లతో చేస్తాడు’’ అని రానా నవ్వులు పండించాడు.

నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా ష్యూర్ సక్సెస్ అవుతుంది సెప్టెంబరులో నితిన్ ఫ్యాన్స్ పండగ చేస్కోవచ్చు. అందరూ ట్రైలర్లో చూసిందాని కంటే నేను గౌతమ్ మీనన్ సినిమాలో చేస్తూ దీని గురించి చాలా తెలుసుకున్నా. సినిమాలో చాలా క్లిప్పింగ్స్ చూశా. కచ్చితంగా పెద్ద హిట్టయ్యే సినిమా. చాలాకొత్తగా ఉంటుంది’’ అన్నాడు.

అఖిల్ మాట్లాడుతూ..  ‘‘గౌతమ్ మీనన్ గారు ఓకే చేసి నిర్మిస్తున్నారంటేనే ఈ సినిమా గొప్పగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. గౌతమ్ గారికి మా అన్నయ్యంటే చాలా ఇష్టం. నాతో కూడా ఆయన ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నా. నాతో సినిమా చేస్తున్న నితిన్.. ఎప్పుడూ కొరియర్ బాయ్ కళ్యాణ్ గురించి నెగెటివ్ గా మాట్లాడలేదు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు’’ అని చెప్పాడు.

నాని మాట్లాడుతూ.. ‘‘గౌతమ్ నాతో తీసిన ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు ఆడియో ఫంక్షనే చేయలేదు. కానీ కొరియర్ బాయ్ కళ్యాణ్ కి మాత్రం చేస్తున్నాడు. ఇది అన్యాయం. గౌతమ్ టేస్టేంటో నాకు తెలుసు. కాబట్టి ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్టవుతుంది. నితిన్ 2005లో వచ్చిన అల్లరి బుల్లోడు సినిమా కంటే ఈ సినిమాలో కుర్రాడిలా కనిపిస్తున్నాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా నితిన్ సినిమాకు పని చేసినప్పటి నుంచి నాకు చాలా మంచి స్నేహముంది’’ అన్నాడు.
Tags:    

Similar News