ఆల్రెడీ నాగచైతన్యకు అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది. అలాగే బావ రానా దగ్గుబాటికి రామానాయుడు స్టూడియోస్ ఉంది. కాని బాలీవుడ్ తరహాలో ఏదైనా మాంచి ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే మాత్రం.. వీళ్లకు సొంతంగా ఒక బ్యానర్ ఉంటే బెటర్ అనే థాట్ వచ్చిందట. ఇంకేముంది.. అనుకున్నదే తడవు.. అది ఇంప్లిమెంట్ చేసేద్దామని చూస్తున్నారు.
లేటెస్ట్ టాక్ ఏంటంటే.. ఇప్పుడు నాగచైతన్య అండ్ రానా కలసి సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టబోతున్నారు. తమ ఫ్యామిలీ ప్రొడక్షన్ హౌసులకూ దీనికీ సంబంధం లేకుండా.. ఈ బ్యానర్ పై వారు డిఫరెంట్ జానర్ సినిమాలకు ప్రొడ్యూస్ చేయబోతున్నారట. ఈ సినిమా కంపెనీ తమ తొలి సినిమాగా ఒక హారర్ కథను ప్రొడ్యూస్ చేయాలని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడితో ఒక కొత్త తరహా ఫార్మలా కథను రూపొందిస్తున్నారట. సినిమా నిర్మాణానికి రామానాయుడు స్టూడియోస్ అవుట్ డోర్ అండ్ లాజిస్టిక్స్ సపోర్టు అందిస్తే.. అన్నపూర్ణ వారు పోస్ట్ ప్రొడక్షన్ సపోర్టును మొత్తం చూసుకుంటారట.
ఈ విషయం ఇంకా అఫీషియల్ గా ప్రకటించనప్పటికీ.. వీరి ప్రొడక్షన్ హౌస్ లాంచించి ఈవెంట్ త్వరలోనే ఉండబోతుందని అంటున్నారు. ఈ కంపెనీ యవ్వారాలు హీరోయిన్ సమంత దగ్గరుండి చూసుకునే ఛాన్సు కూడా ఉందట. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/