హీరోయిన్ల కురచ దుస్తుల వివాదం ఇంకా సద్దుమణగలేదు. తమన్నా - విశాల్ జంటగా నటించిన కత్తి సండై చిత్రం ఈ మధ్యనే తమిళనాట విడుదలైంది. తెలుగులో కూడా ‘ఒక్కడొచ్చాడు’ టైటిల్ తో డబ్బింగ్ అయి థియేటర్లలో ఆడుతోంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా దర్శకుడు సురాజ్ చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల ఆనందం కోసం హీరోయిన్లు అందంగా కనిపించాలనీ, గ్లామరస్ గా తయారు కావాలని సురాజ్ కామెంట్ చేశాడు. హీరోయిన్లకు భారీ ఎత్తున పారితోషికాలు ఇస్తున్నదే చిట్టిపొట్టి దుస్తులు వేసుకోవడం కోసం సురాజ్ అన్నాడు. అంతే... అక్కడితో వివాదం మొదలైంది. దక్షిణాది తారలు వరుసగా స్పందించేసి సురాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు కూడా కోరాడు. అయినాసరే... ఈ వివాదం ఇంకా సద్దుమణగడం లేదు.
ఈ వివాదంపై కాస్త ఆలస్యంగా రానా స్పందించాడు. తనకు ఈ విషయం ఇప్పుడు తెలిసిందీ అంటూ ట్వీట్ చేశాడు. ‘ఇలాంటి వ్యక్తుల మధ్యలో మనం పనిచేస్తున్నాం అని చెప్పుకోవడానికి అవమానకరంగా ఉంది’ అన్నాడు. తమన్నాకి మద్దతుగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదంపై రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించింది. సురాజ్ పై విమర్శలు గుప్పించింది. కుటుంబంలో ఆడవాళ్లు ఉన్నవారు ఎవరైనా ఇలా వ్యాఖ్యానిస్తారా అంటూ రకుల్ వ్యాఖ్యానించింది. హీరోయిన్లు పొట్టి దుస్తులు వెయ్యాలో వద్దో నిర్ణయించడానికి ఈ దర్శకుడు ఎవరూ అంటూ కాస్త తీవ్రంగానే సురాజ్ ను ఉద్దేశించింది విమర్శించింది. సినీ పరిశ్రమకు వచ్చింది నటించడానికి మాత్రమేననీ, మహిళల్ని అవమానించడం సరికాదంటూ మండిపడింది.
రకుల్ తోపాటు ఇతర హీరోయిన్లు కూడా తమన్నాకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్షీ ప్రసన్న - ప్రణీత కూడా సురాజ్ పై విమర్శలు గుప్పించారు. సురాజ్ క్షమాపణలు చెప్పినా కూడా ఈ వివాదం సద్దుమణిగేలా లేదు. తమన్నాకు మద్దతుగా అందరూ నిలుస్తూ దర్శకుడిని విమర్శిస్తున్నారు. ఒక్కసారి నోరు జారినందుకు సురాజ్ ఇంకా విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/