ఎలాగైనా సరే బాహుబలి రక్తాన్ని మాహిష్మతి సామ్రాజ్యంలో లేకుండా చేయాలనేదే భల్లాల దేవ టార్గెట్. తన తండ్రిని అంతమొందించిన ఆ క్రూరుడ్ని చంపేయాలనేదే బాహుబలి జూనియర్ టార్గెట్. బాలీవుడ్ లో ఎవరైనా యాక్టర్లు ఇలా విలన్లుగా నటించాలంటే మాత్రం.. కాస్త ఎడముఖం పెడముఖంగా ఉంటూ.. అదిగో రణవీర్ సింగ్ దీపిక పదుకొనె టైపులో దూరంగా ఉంటూ (పద్మావతి సినిమా కోసం వీరు దొంగ బ్రేకప్ అయ్యారులే).. వెండితెరపై భారీ ఎమోషన్లు పండించాలని ప్రయత్నిస్తుంటారు. కాని బయట అలా లేకపోయినా కూడా.. అలాంటి క్రూరమైన శత్రుత్వం చూపించొచ్చు.. అంటున్నారు బాహుబలి అండ్ భల్లాలదేవ.
బాహబలి 2 సినిమాను ప్రమోట్ చేయడానికి ముంబయ్ లో ఇంటర్యూల మీద ఇంటర్యూలు ఇస్తున్న ప్రభాస్ అండ్ రానా.. అక్కడి మీడియాకు దిమ్మతిరిగే ఆన్సర్లే చెప్పారులే. అసలు బయట ప్రపంచంలో మీ ఇద్దరి ఈక్వేషన్ ఇంత బాగుందేంటి అని ఒక జర్నలిస్ట్ అడిగితే.. ''స్ర్కీన్ మీద కొట్టేసుకున్నాం అని బయట కొట్టేసుకోవక్కర్లేదు. అసలు మేం మాంచి ఫ్రెండ్స్ కావడం వలనే స్ర్కీన్ మీద అలా చేయగలిగాం. రోజూ చక్కగా ఏ ఎమోషన్ ఎలా చేస్తే బాగుంటుందో డిస్కస్ చేసుకునేవారం. ఆ తరువాత షాట్లు బాగా చేసేవాళ్ళం'' అంటూ రానా చెప్పాడు. ఇదే ప్రశ్నను ప్రభాస్ ను అడిగితే.. ''నాది కూడా సేమ్ ఆన్సర్'' అన్నాడు. బాలీవుడ్ బాబులూ.. మా పద్దతి వేరయ్యా సామీ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/