అంతర్జాతీయ స్ట్రీమింగ్ దిగ్గజాలతో రానా బిగ్ డీల్!

Update: 2021-07-02 07:12 GMT
ఇన్నాళ్లు బుల్లితెర‌.. ఓటీటీ అంటే చిన్న చూపు ఉండేది. కానీ క‌రోనా మ‌హ‌మ్మారీ రంగ ప్ర‌వేశంతో సీన్ మారిపోయింది. కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేదోయ్.. ! అన్న‌చందంగా అయ్యింది. థియేట‌ర్ల‌లో సినిమాలు రిలీజ్ కాని ప‌క్షంలో ఓటీటీ అయినా ఫ‌ర్వాలేద‌నే ధోర‌ణి యువ‌త‌రంలో మొద‌లైంది. దాంతో పాటే ఓటీటీకి విశేష ఆద‌ర‌ణ ద‌క్కుతోంది. ఈ ఛేంజ్ తో పాటే టాలీవుడ్ స్టార్ల మైండ్ సెట్ కూడా మారుతోంది.

ఇప్ప‌టికిప్పుడు అగ్ర హీరోయిన్లు హీరోలు కూడా ఓటీటీ సిరీస్ ల‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నారు. మొన్న‌టికి మొన్న స‌మంత ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో మెరుపులు మెరిపించిన తీరు ఇప్ప‌టికీ చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది. సౌత్ టాప్ హీరోయిన్లు అంతా వెబ్ సిరీస్ ల‌తో ఫుల్ బీజీ. అక్కినేని ఫ్యామిలీ నుంచే నాగార్జున‌- నాగ‌చైత‌న్య‌ వంటి స్టార్లు ఓటీటీ సిరీస్ ల‌లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు.

ఇప్పుడు ద‌గ్గుబాటి కాంపౌండ్ లో రానా దగ్గుబాటి నెట్ ఫ్లిక్స్ తో చర్చలు ప్రారంభించారు. అతడు ఇప్ప‌టికే బాహుబ‌లి ఫ్రాంఛైజీ న‌టుడిగా పాన్-ఇండియా స్టార్ డ‌మ్ ని క‌లిగి ఉన్నారు. అందువల్ల రానా ఓటీటీ కంటెంట్ లో న‌టించాల‌ని అలాగే వెబ్ సిరీస్ ల‌ను నిర్మించాల‌ని స‌రికొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకొచ్చారు. తన ప్రొడక్షన్ హౌస్ డిజిటల్ స్పేస్ లో ప్ర‌వేశించాల‌ని బ‌లంగా కోరుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ డిజిటల్ కంటెంట్ ను ఉత్పత్తి ని ఇప్ప‌టికే ప్రారంభించింది. నెట్ ఫ్లిక్స్ తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు చ‌ర్చ‌లు సాగిస్తున్నారు. రానా దగ్గుబాటికి బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లు.. అంతర్జాతీయ స్ట్రీమింగ్ దిగ్గజాలలో పరిచయాలను రానా ఎన్ క్యాష్ చేసుకునే ప్లాన్ లో ఉన్నారు.

నెట్ ఫ్లిక్స్ సహా అమెజాన్ ప్రైమ్ ఇత‌ర సంస్థ‌ల‌తోనూ సురేష్ కాంపౌండ్ కి చ‌క్క‌ని రిలేష‌న్ షిప్స్ ఉన్నాయి. అలాగే ఓటీటీ- డిజిట‌ల్ కంటెంట్ ని సురేష్ బాబు - రానా తొలి నుంచి ఎంక‌రేజ్ చేస్తూనే ఉన్నారు. టెక్నాల‌జీని కొత్త‌ద‌నాన్ని ఆహ్వానించ‌డంలో ఈ ఎంట‌ర్ ప్రెన్యూర్స్ ఎప్పుడూ ముందుంటారు. అలాగే ఓటీటీల భ‌విష్య‌త్ పైనా సురేష్ బాబు ఎంతో ముందు చూపుతో ఉన్నారు. అందుకే ఇప్పుడు రానా బిగ్ డీల్ స‌ర్వ‌త్రా ఉత్కంఠ పెంచుతోంది.

రానా న‌టించిన విరాట‌ప‌ర్వం స‌హా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించిన దృశ్యం 2- నార‌ప్ప చిత్రాల‌ను ఓటీటీల‌కే విక్ర‌యించార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. విరాట‌ప‌ర్వం కోసం నెట్ ఫ్లిక్స్ తోనే భారీ డీల్ కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News