అత్తారింటికి వెళ్లిన రానా.. విశేష‌మేమిటంటే!

Update: 2021-06-11 14:30 GMT
రానా దగ్గుబాటి ఇంటీరియర్ ప్రొఫెష‌న‌ల్ కం ఈవెంట్ మేనేజ‌ర్ మిహీక బ‌జాజ్ ని వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట లైఫ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ప్ర‌తి ఫోటో అభిమానుల్లో వైర‌ల్ అయ్యాయి.

గురువారం రానా బంటీ బ‌జాజ్ పుట్టినరోజు సందర్భంగా అత్తారింటిని సందర్శించారు. అందుకు సంబంధించిన ఓ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో రానాతో పాటు అతని భార్య  మిహీకా బజాజ్.. ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. మిహీకా బజాజ్ హైదరాబాద్ బజాజ్ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తల్లి బంటీ -తండ్రి సురేష్ బజాజ్ `క్రిసాలా ఆభరణాలు` అనే కోచర్ జ్యువెలరీ బ్రాండ్ స్థాపకులు. మిహీకా బజాజ్ ఇంటీరియర్ డెకర్ .. డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరుతో ఈవెంట్ మేనేజ్ మెంట్ బిజినెస్ చేస్తున్నారు.

అల్లుడు రానా రాక‌తో బంటీ బ‌జాజ్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ``నా పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా సెల‌బ్రేట్ చేసినందుకు నా కుటుంబానికి ధన్యవాదాలు`` అని వ్యాఖ్య‌ను జోడించారు.

గత ఏడాది ఆగస్టులో హైదరాబాద్ లో కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో రానా దగ్గుబాటి- మిహీకా వివాహం జరిగింది. ఆహ్వానాలు అందుకున్న 30 మంది అతిథులలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు కాకుండా.. రానా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ అతని భార్య ఉపసనా..  అల్లు అర్జున్ కూడా ఉన్నారు.

Full View
Tags:    

Similar News