యంగ్ హీరోలంతా తారా జువ్వల్లా దూసుకొస్తున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు అందుకుంటూ స్టార్ హీరోలకే పోటీగా నిలు స్తున్నారు. అవకాశాలు క్యూ లో నిలుస్తున్నాయి. మార్కెట్ పరంగానూ మెరుగ్గా కనిపిస్తున్నారు. పరిమిత బడ్జెట్ లోనే వందల కోట్ల వసూళ్లు సాధించే చిత్రాలు చేస్తున్నారు. నిఖిల్..రిషబ్ శెట్టి..సిద్దు జొన్నలగడ్డ లాంటి ఎలాంటి బ్యాకప్ లేకుండానే వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు.
కానీ అన్ని ఉన్నా కొందరికి కలిసి రావడం లేదు. పాన్ ఇండియాలో ఫేమస్ అయిన రానా దగ్గుబాటి కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ ప్రారంభమై దశాబ్ధం పూర్తయినా ఇంకా వేగం పుంజుకోలేదు. రకరకాల ప్రయోగాలైతే చేస్తున్నాడు గానీ...అవి కమర్శియల్ గా వర్కౌట్ అవ్వడం లేదు. కంటెంట్ పరంగా బెస్ట్ పెర్పార్మర్ గా నిలుస్తున్నా మార్కెట్ పరంగా నె మ్మదించే ఉన్నారు.
`బాహుబలి` పక్కనబెడితే ఇంత వరకూ 100 కోట్ల సోలో సక్సెస్ రానా కెరీర్ లో ఒక్కటీ లేదు. అతని కన్నా ముందు ...వెనుకా వచ్చిన హీరోలెంతో మంది రేసులో దూసుకుపోతున్నా! రానా మాత్రం వెనుకబడే కనిపిస్తున్నారు. ఆ మధ్య `విరాట పర్వం` సినిమాతో మరో ప్రయత్నం చేసాడు. సినిమాకి మంచి పేరొచ్చింది. అందులో పాత్రలకి మంచి గుర్తింపు దక్కింది.
కానీ కమర్శియల్ గా రాణించలేదు. ఆ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా? ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. అయితే `విరాట పర్వం`కి ముందే రానా ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ఈ తరహా సినిమాలు చేయనని...కమర్శియల్ పంథా లోనే వెళ్తానని అన్నారు.
కానీ ఆ తరహా స్ర్కిప్ట్ ఈ ఏడాది కుదిరేలా లేదు. రానాకి కథలు చెప్పినట్లు ఇంత వరకూ ఒక్క దర్శకుడి పేరు తెరపైకి రాలేదు. ఆయన కథలు వింటున్నట్లు కథనాలు రాలేదు. మరి మౌనం తో వచ్చే కమిట్ మెంట్ సౌండింగ్ భారీగా ఉండాలని ఆశిద్దాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.