టాలీవుడ్ తో పాటు హింది - తమిళ సినిమాల్లో ఏకకాలంలో నటిస్తూ తన డైరీని బాగా బిజీగా మార్చుకున్న దగ్గుబాటి రానా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కు దూరంగా ఉంటున్నాడు. కథలో వైవిధ్యం ఉంటే తప్ప కొత్త ప్రాజెక్ట్స్ ని ఒప్పుకోవడం లేదు. హీరోగా సెటిల్ అవుదామని ఎంట్రీ ఇచ్చిన ఈ దగ్గుబాటి కుర్రాడు తన పర్సనాలిటీకి ఒకే తరహా పాత్రలు చేస్తూ పోతే ఎక్కువ ఫ్యూచర్ ఉండదని గుర్తించి దానికి తగ్గట్టే స్టొరీ సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందులో భాగంగా చేస్తున్న మూవీ హాతీ మేరే సాతి. అంటే ఏనుగే నా తోడు. అడవిలో అందులోనూ ఏనుగుల మధ్య ఈ సినిమా కథ మొత్తం ఉంటుంది. అందుకే రానా దీన్ని ఆషామాషీగా తీసుకోకుండా నిజంగానే ఏనుగులతో ఫ్రెండ్ షిప్ చేయబోతున్నాడు.
త్వరలో థాయిలాండ్ అడవుల్లో షూటింగ్ జరుపుకోకున్న ఈ సినిమా కోసం రానా ఓ రెండు వారాల పాటు ప్రత్యేక ట్రైనర్ల సహాయంతో ఒంటరిగా ఏనుగులతో స్నేహం చేసేందుకు సిద్ధపడుతున్నాడు. సినిమా ఇంకా మొదలు పెట్టక ముందే వాటిని మచ్చిక చేసుకుని భావోద్వేగాలు ఎలా ఉంటాయో దగ్గరుండి పరిశీలించబోతున్నాడు. అంటే బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పూర్తిగా జంతువులతో మమేకమయ్యే కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సరికొత్త అనుభూతి కోసం రానా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు.
హాతీ మేరే సాథీ అనే టైటిల్ తో 1971లో రాజేష్ ఖన్నా హీరోగా హిందిలో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది. ఎంఎ తిరుముగం దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా చిన్నాపెద్ద మొదలుకొని ఆబాల గోపాలాన్ని విశేషంగా ఆకట్టుకుంది. దాని తర్వాతే సినిమాల్లో ఏనుగుల వాడకం విస్తృతంగా పెరిగింది. రానా సినిమా దాని రీమేకా అనేది నిర్మాతలు చెప్పలేదు కాని ఆ ఛాయలు ఉండే అవకాశాలు లేకపోలేదు. తెలుగు వెర్షన్ కోసం అడవి రాముడు అనే టైటిల్ పరిశీలనలో ఉంది కాని ఇంకా ఏది ఖరారు చేయలేదు.