స్టార్ ఫ్యామిలీల నుండి వచ్చిన హీరోలకు ఒక వింత అనుభవం ఎదురవుతుంది. వారు ఏం చేసినా కూడా వారి ఫ్యామిలీలోని సీనియర్లు ఎలా చేశారో జనాలు వాటితో కంపేర్ చేస్తుంటారు. పవన్ లుంగీ కడితే దానిని చిరంజీవి లుంగీ లుక్ తో కంపేర్ చేయడం.. మహేష్ బాబు లుక్స్ ను కృష్ణ లుక్కులతో కంపేర్ చేయడం.. అలాగే తాత-మనవడు.. అబ్బాయ్-బాబాయ్ అంటూ చాలా వరకు కంపేరిజన్స్ నడుస్తుంటాయి.
ఇప్పుడు త్వరలో రిలీజ్ కానున్న ''నేనే రాజు నేనే మంత్రి'' సినిమా కోసం రానా లుంగీ కట్టేసి రచ్చ చేశాడు. టీజర్లోనే ఈ లుక్ ను చూపించేశాడు దర్శకుడు తేజ. లుంగీ కట్టుకుని మనోడు నేనెప్పుడు చావాలో నేనె చెప్తా.. నువ్వెప్పుడు చావాలో కూడా నేనే చెప్తా.. అంటూ ఒక ఫైర్ బ్రాండ్ డైలాగ్ పేల్చాడు. అయితే ఇప్పుడు రానా కట్టుకున్న లుంగీ లుక్.. కొన్నేళ్ళ క్రితం వెంకటేష్ కట్టిన ఒక లుంగీ లుక్కుతో కంపేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఇది అటూ ఇటూ చేరి చివరకు వెంకీ కంట్లో పడింది. ఆయనేమో.. 'రానా ఇది చూశావా నానా' అంటూ షేర్ చేశారు. అది సంగతి.
ఇకపోతే ఇప్పుడు రానా సినిమా గురించి వెంకీ కూడా చాలా ఎక్సయిట్ అవుతున్నారనే చెప్పాలి. కాని తన సొంత సినిమా ఎప్పుడో మాత్రం ఆయన చెప్పట్లేదు. ఇప్పటివరకు చాలా సినిమాల ప్లానింగులో ఉన్నాయి కాని.. సాలిడ్ గా ఏ సినిమా కూడా మొదలవ్వలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/