గతేడాది మే 18న టాలీవుడ్ దిగ్గజం, వందకు పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ రికార్డ్ సాధించిన దగ్గుబాటి రామానాయుడు స్వర్గస్తులయ్యారు. టాలీవుడ్ మొత్తం కన్నీటి సంద్రమైన రోజు ఇది. తన తాత మరణాన్ని గుర్తు చేసుకుంటూ.. దగ్గుబాటి రాణా చేసిన ట్వీట్ అందరికీ ఆ రోజును మరోసారి గుర్తు చేసింది.
'సరిగ్గా ఏడాది క్రితం ఇదో రోజు నా జీవితంలోను, మా ఇంటిలోను వెలుగు ఆరిపోయింది. కానీ ఆకాశంలోకి వెళ్లిన వెలుగు, అక్కడి నుంచే నాకు మరింత వెలుగును, శక్తిని పంచుతోందని అప్పుడే అర్ధమైంది. నాలాంటి ఓ నాస్తికుడిని దేవుడు, స్వర్గం అని నమ్మేలా చేసి, తనే నాకు దేవుడయ్యాడు. మా తాత నా శక్తి. నా జీవితం. నిన్ను చాలా చాలా మిస్ అవుతున్నా తాతా. RIP' అంటూ దగ్గుబాటి రాణా ట్వీట్ చేశాడు.
రామానాయుడు ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి. సినీ రంగానికి ఎందరో హీరోలు - హీరోయిన్లు - దర్శకులు - టెక్నీషియన్లను అందించిన మహనీయుడు. అంతటి ఘనకీర్తి గల మహా మనిషికి.. ఆయన కుటుంబం ఆత్మీయ నివాళి పలుకుతోంది. తెలుగు సినీ పరిశ్రమ సినిమా రంగం మొత్తం కూడా కన్నీటితో ఆ మహనీయుడిని గుర్తు చేసుకుంటోంది.