గుబురుగెడ్డంతో భల్లాలదేవుడు..

Update: 2018-03-30 10:31 GMT
రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా సినిమాలకి ఆమడ దూరంలో ఉంటూనే తనకంటూ ఒక పెద్ద మార్కెట్ ను స్థాపించుకున్న హీరో మన దగ్గుబాటి వారసుడు రానా. ఘాజి లో నేవీ ఆఫీసర్ గా అయినా, బాహుబలి లో కపట బుద్ది కండబలం ఉన్న రాజుగా అయినా సులభంగా ఒదిగిపోయే సామర్ధ్యం రానా కి మాత్రమే సొంతం. ఇప్పుడు మరొక కొత్త పాత్ర పోషించడానికి రెడీగా ఉన్నాడు భల్లాల దేవుడు.

నేషనల్ అవార్డ్ గ్రహీత ప్రభు సోలమన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు రానా. హిందీ లో హాథి మేరే సాథి గా తెరకెక్కనున్న ఈ సినిమా తెలుగులో అడవి రాముడు గా మన ముందుకు రాబోతోంది. ఈ సినిమా తాలూకు లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అందులో రానా గుబురు గెడ్డం బాగా పొడుగ్గా పెంచి కనిపిస్తున్నాడు. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో రానా పర్యావరణను కాపాడే అతనిలా కనిపిస్తాడు. కానీ ఏనుగుతో కలిసి నటించడం అంటే మాటలు కాదు కదా. అందుకే ఈ 'నేను నా రాక్షసి' హీరో చాలా సీరియస్ గా ట్రైనింగ్ తీసుకున్నాడు.

సినిమాలో రానా పోషిస్తున్న పాత్ర పేరు బందేవ్. చాలా వరకు షూటింగ్ థాయిలాండ్ మరియు ఇండియా లో జరగబోతోంది. ఈ సినిమా తెలుగు - హిందీ - తమిళ భాషల్లో తెరకెక్కనుంది. మొత్తానికి రానా కొత్త లుక్ చూస్తుంటే సినిమా పైన ఆసక్తి పెరిగిపోతోంది అంటున్నారు ఫాన్స్.  


Tags:    

Similar News