ఏ ముహూర్తాన హీరో వేషాలు వదిలేసి గెస్ట్ రోల్స్ - స్పెషల్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టాడు అప్పుడే మారిపోయింది రానా కెరీర్. తమిళంలో ఆరంభం - హిందీలో బేబీ - తెలుగులో బాహుబలి.. ఒక్కో సినిమా అతణ్ని ఒక్కో మెట్టు ఎక్కించింది. ప్రస్తుతం మూడు భాషల్లోనూ మాంచి క్రేజ్ ఉన్న నటుల్లో అతనొకడు. రానా ప్రస్తుతం చేస్తున్న - చేయబోయే సినిమాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవే. ఇటీవలే హిందీలో ‘ఘాజి’ అనే సబ్ మెరైన్ నేపథ్యంలో తెరకెక్కే వార్ మూవీ ఒకటి రానా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళంలో అతడికి మరో సెన్సేషనల్ మూవీ దక్కింది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేయబోతున్నాడు రానా. అందులో రానాతో పాటు ఆర్య - విశాల్ - అరవింద్ స్వామి - అధర్వ ముఖ్య పాత్రలు పోషించబోతున్నాడు. సేతు - పితామగన్ (శివపుత్రుడు) - నాన్ కడవుల్ (నేను దేవుణ్ని) - అవన్ ఇవన్ (వాడు వీడు) - పరదేశి లాంటి సినిమాలతో కోలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు బాలా. అతడితో సినిమా అంటే ఏ నటుడైనా కళ్లు మూసుకుని ఒప్పేసుకుంటాడు. తనతో ఇప్పటికే పని చేసిన ఆర్య - విశాల్ - అధ్వర్వలతో పాటు ఆర్య - అరవింద్ స్వామి లాంటి హ్యాండ్సమ్ యాక్టర్స్ ని ఈ సినిమా కోసం తీసుకున్నాడు బాలా. తమిళంలో అనేక వివాదాలకు దారి తీసిన ‘కుట్ర పరంబరై’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.