బల్లాల దేవుడు రెడీ అవుతున్నాడుగా..

Update: 2015-11-12 06:48 GMT
ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి బాహుబ‌లి 2 కోసం రెడీ అవుతున్నాడు. ఆర్టిస్టులంద‌రినీ క‌థ‌న‌రంగంలోకి దూకేందుకు రెడీ క‌మ్మ‌ని చెప్పాడు. ఎవ‌రికి వారు ప్రిప‌రేష‌న్‌ లో ఉన్నారిప్పుడు. ప్ర‌భాస్‌ - రానా స్పెష‌ల్ ట్రైనింగుల‌తో భీక‌ర ఆకారాల్ని రెడీ చేసుకుంటున్నారు. మ‌రోవైపు స్వీటీ అనుష్క స‌న్న‌జాజి తీగ‌లా దేహ‌శిరుల్ని మార్చుకునేందుకు రెడీ అవుతోంది. అయితే ఈలోగానే బాహుబ‌లిని కొట్టే భ‌ళ్లాల‌దేవుడు ఎలా ఉంటాడో చూడండి అంటూ రానా అంద‌రికీ స‌వాల్ విసిరాడు. ఇదిగో ఇక్క‌డున్న ఈ ఫోటో చూస్తే మీరే ఆ మాట చెబుతారు.

రానా ద‌గ్గుబాటి లో రోజురోజుకి క‌సి పెరిగిపోతోంది. కండ‌లు పెంచాల‌న్న దాహం రెట్టింప‌వుతోంది. చూస్తుంటే అత‌డు రాక్‌ ని మించిపోయేట్టే క‌నిపిస్తున్నాడు. ఇప్ప‌టికే బెంగ‌ళూర్ డేస్ షూటింగు పూర్తి చేసుకుని బాహుబ‌లి కోసం క‌స‌ర‌త్తులు మొద‌లు పెట్టాడు. స్పెష‌ల్ కోచ్ సాయంతో త‌న‌ని తాను సిస‌లైన రాక్‌ లా మార్చుకుంటున్నాడు. పార్ట్ 1 కోసం ఎంతో శ్ర‌మించాడు. అందుకు త‌గ్గ‌ట్టే పేరొచ్చింది. ఓ అడ‌వి దున్న‌తో పోరాడి నెగ్గే మ‌గాడిగా మెప్పించాడు. కాళ‌కేయుడితో ఢీ అంటే ఢీ అంటూ వార్‌ లో ముందుకు ఉరికే ఉగ్రుడిగా క‌నిపించాడు. ఇప్పుడు ఏకంగా అమ‌రేంద్ర బాహుబ‌లితోనే పెట్టుకోవాల్సిన టైమ్ వ‌చ్చేస్తోంది.

రెండో భాగంలో బాహుబ‌లిని ఢీకొట్టే స‌న్నివేశాల‌కు కొద‌వుండ‌దు. మ‌గువ కోసం - రాజ్యం కోసం కొట్టుకునే సంద‌ర్భం పార్ట్ 2లో ఉంటుంది. మొద‌టి పార్ట్‌లో కంటే మ‌రింత భీక‌రంగా క‌నిపిస్తేనే రాక్ష‌సాకారంలో క‌నిపిస్తేనే అంద‌రినుంచి ప్ర‌శంస‌లు పొంద‌గ‌లం. మెలితిరిగిన కండ‌లు, పొంగులు వారిన న‌రాలు .. చూస్తుంటే భ‌యంక‌రుడిగా మారిపోయేట్టే క‌నిపిస్తున్నాడు. ఎనీవే బాహుబ‌లి కోసం రానా రెడీ అవుతున్న తీరుకి, రానాలోని ప‌ట్టుద‌ల‌కు హ్యాట్సాఫ్‌.
Tags:    

Similar News