లీడర్ తో హీరోగా పరిచయమైనా బాహుబలిలో విలన్ గా వచ్చిన బ్రేక్ రానాను ఎక్కడికో తీసుకెళ్ళింది. నేనే రాజు నేనే మంత్రి మంచి విజయాన్నే సొంతం చేసుకున్నా క్యారెక్టర్ డిమాండ్ కు తగ్గట్టు కథలను ఒప్పుకుంటున్న రానా త్వరలో వేణు ఊడుగుల దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. నీది నాది ఒకే కథ ద్వారా మెప్పులు వసూళ్లు పొందిన వేణు ఇప్పుడు తీయబోయే రెండో సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నట్టు సమాచారం.
టైటిల్ కూడా విరాటపర్వం 1992 అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. అధికారికంగా ఖరారు చేయలేదు. ట్విస్ట్ ఏంటంటే ఇందులో రానా పంచాయితి రాజ్ వార్డ్ మెంబెర్ గా నటిస్తున్నట్టు సమాచారం. కథలో చాలా కీలక మలుపులతో పాటు ఈ బ్యాక్ డ్రాప్ లో రానా గతంలో చేసిన నేనే రాజు నేనే మంత్రి లీడర్ కన్నా చాలా డిఫెరెంట్ గా దీన్ని తీర్చిదిద్దినట్టు వినికిడి
ఈ లెక్కన చూసుకుంటే రాజకీయ నేపధ్యంలో రానాకు ఇది మూడో సినిమా అవుతుంది. మొదటి రెండు చెప్పుకోదగ్గ సక్సెస్ ఇచ్చాయి కాబట్టి ఇది హ్యాట్రిక్ అవుతుందన్న అంచనా పెట్టుకోవడంలో తప్పు లేదు. సాయి పల్లవి ఒప్పుకుంది అంటే ఇందులో చాలా విషయమే ఉండొచ్చనే టాక్ ఫిలిం నగర్ లో ఉంది. ప్రస్తుతం హాతీ మేరె సాతితో పాటు మరో రెండు సినిమాల్లో బిజీగా ఉన్న రానా త్వరలోనే వేణు ఊడుగుల సినిమా మొదలుపెడతాడు. టెక్నికల్ టీం తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి మరోసారి రాజకీయ తంత్రంలో భల్లాలదేవాని చూడబోతున్నాం అన్నమాట