టాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి దగ్గుబాటి రామానాయుడు. ఇండస్ట్రీకి ఎంతో మందిని పరిచయం చేసిన మహనీయుడు. శతచిత్ర నిర్మాతగా ఖ్యాతి గాంచిన ఈయన.. రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 18న కన్ను మూశారు. సినీ పరిశ్రమ మొత్తం ఇప్పుడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తోంది.
తాతయ్య రామానాయుడు పేరునే.. షార్ట్ ఫామ్ లో తన పేరుగా పెట్టుకున్నాదు రానా. తాతయ్య అంటే ఎంత ఇష్టమో.. ఎంత మమకారమో చాలాసార్లే చెబుతూ ఉంటాడు. ఇప్పుడు రామానాయుడు రెండో వర్ధంతి సందర్భంగా.. ఓ ట్వీట్ పెట్టిన రానా.. అందరి హృదయాలను కదిలించేశాడు. 'నేకు తెలిసిన ప్రతీ విషయాన్ని నేర్పినందుకు కృతజ్ఞతలు. పైనున్న స్వర్గం నుంచి నన్ను చూస్తూ ఉన్నందుకు మరీ మరీ కృతజ్ఞతలు. మీరు లేకుండా గడుస్తున్న ప్రతీ రోజున.. మిమ్మల్ని మిస్ అవుతున్నా' అని ట్వీట్ పెట్టిన రానా.. తమ్ముడు అభిరామ్ ను తనను చెరో వైపు పట్టుకున్న రామానాయుడు ఫోటోను షేర్ చేశాడు.
అంత చిన్న వయసులో రానా మొహంలో ఎంత కళ ఉందో.. ఇప్పటికీ అదే జోష్ కొనసాగిస్తున్నాడు ఈ కుర్రాడు. తాజాగా ఘాజీ మూవీతో భారీ సక్సెస్ నే ఖాతాలో వేసుకున్నాడీ దగ్గుబాటి హీరో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/