ఇద్దరమ్మాయిల మధ్యన రాణా

Update: 2016-03-12 04:35 GMT
బాహుబలిలో విలన్ భల్లాలదేవుడిగా రాణా భారీ విగ్రహంతో కనిపిస్తాడు. గంభీరంగా మాట్లాడుతూ మాటలతోనే భయపెట్టేస్తాడు. కానీ ఇతగాడు నిజానికి చాలా చిలిపి మనస్తత్వం. బాగా అల్లరి చేస్తాడని చెప్పడం.. రాణా చేసే హంగామాకి చాలా చిన్న మాట. ఎప్పుడూ ఎవరో ఒకరిని ఆట పట్టిస్తూనే ఉంటాడు.

 ఎక్కడికెళ్లినా తన క్రియేటివిటీని, హంగామాని ఏ మాత్రం వదిలిపెట్టడు రాణా. ఇదుగో ఇక్కడో ఇద్దరు ముద్దుగుమ్మలు సెల్ఫీ తీసుకుంటుంటే వాళ్లని కూడా ఫ్రీగా వదిలేయలేదు. రీసెంట్ గా హైద్రాబాద్ లో జరిగిన ఓ ర్యాంప్ వాక్ లో సోనాల్ చౌహాన్ - ప్రగ్యా జైస్వాల్ లు భాగం అయ్యారు. ఓ ఛారిటీ కోసం ఈ షో ఏర్పాటు చేయగా.. దానికి రాణా కూడా హాజరయ్యాడు. ఆ సమయంలో సోనాల్ * ప్రగ్యాలు సెల్ఫీ తీసుకుంటుంటే.. ఇలా చివరి నిమిషంలో మధ్యలో దూరిపోయి ఫోటోలో ఇరుక్కున్నాడు. ఇద్దరు ముద్దుగుమ్మల మధ్యలో చిక్కిపోయాడు.

ఇప్పుడంటే ఇలా ఇద్దరమ్మాయిల మధ్య ఉన్నాడు కానీ.. గతంలో ఇతగాడి స్పీడ్ ఇంకా ఎక్కువగా ఉండేదట. కపుల్స్ మధ్యలో కూడా దూరిపోయేవాడని, ఆ దెబ్బకి కొంతమంది బ్రేకప్ కూడా చెప్పేసుకున్నారనే టాక్ ఉంది. అయినా సరే.. రాణా హంగామా ఏ మాత్రం తగ్గడం లేదు.
Tags:    

Similar News