రాజ్ తరుణ్ కు రానా సపోర్ట్ దొరికిందే!

Update: 2019-03-09 09:02 GMT
రానా దగ్గుబాటి నటుడిగా.. టీవీ షో హోస్ట్ గా తన సత్తా చాటడమే కాదు తాతగారు రామానాయుడు.. నాన్నగారు సురేష్ బాబు బాటలో నిర్మాతగా తన టాలెంట్ నునిరూపించుకునేందుకు  రెడీ అవుతున్నాడు.  ఇప్పటికే నిర్మాతగా కొన్ని ప్రాజెక్టులు ప్లానింగ్ దశలో ఉన్నాయి. ఇవి కాకుండా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి సంయుక్తంగా సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించాడు.

రీసెంట్ గా ఒక నూతన దర్శకుడు వినిపించిన కథ నచ్చడంతో తమ జాయింట్ ప్రొడక్షన్ లో ఆ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నారట.  ఈ సినిమాను తెలుగు-హిందీ భాషలలో నిర్మిస్తారని.. తెలుగు వెర్షన్ కోసం ఇప్పటికే టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ను ఎంపిక చేశారని సమాచారం.  హిందీ వెర్షన్ కు హీరోను ఇంకా ఫైనలైజ్ చేయాల్సి ఉందట.  సమ్మర్ తర్వాత ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్తారని సమాచారం.

రాజ్ తరుణ్ హీరోగా నటించిన సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ వద్ద వరసగా నిరాశపరుస్తున్నాయి.  దీంతో రాజ్ తరుణ్ కాస్త గ్యాప్ కూడా తీసుకున్నాడు.  ఈ సమయంలో రానా బ్యానర్లో అవకాశం దొరకడం రాజ్ తరుణ్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చేదే.  రానా స్టొరీ సెలెక్షన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి కథ పరంగా రాజ్ తరుణ్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.  ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతున్నారని.. క్యాస్ట్ అండ్ క్రూ ఫైనలైజ్ అయ్యాక అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.
    

Tags:    

Similar News