గత కొన్ని నెలలుగా కరోనా కారణంగా రిలీజ్ లు వాయిదా పడిన చిత్రాలన్నీ థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఇందులో పాన్ ఇండియా మూవీస్ నుంచి చిన్న చిత్రాల వరకు ప్రతీ సినిమా కరోనా కారణంగా థియేటర్లలోకి రాలేకపోయి. అయితే ఇటీవల పరిస్థితుల్లో మార్పులు సంభవించడంతో భారీ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్.. చిన్న చిత్రాలు ఇలా వరుసగా థియేటర్ల బాట పట్టేశాయి. అయితే ఒకే ఒక్క సినిమా మాత్రం ఇప్పటికి రిలీజ్ కాలేదు. అలాగే ఆ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్ కూడా బయటికి రాలేదు.
అదే రానా హీరోగా నటించిన `విరాటపర్వం`. వేణు ఊడుగుల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఉత్తర తెలంగాణలో 1990 నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘనల స్ఫూర్తితో తెరకెక్కింది. ఆనాటి ఉద్యమ పరిస్థితుల్ని, తెలంగాణ పల్లెల్లో జరిగిన వాస్తవిక సంఘనటలని మేళవించి ఓ యాదార్ధ చిత్ర రూపంగా ఈ చిత్రాన్ని దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ డి. సురేష్ బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో భరతక్కగా ప్రియమణి నటించగా డాక్టర్ అయిన వ్యక్తి ఉద్యమ నాయుకుడు రవన్నగా మారిన వైనాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారు. సినిమా అంతా పూర్తయింది. రిలీజ్ కు రెడీ గత ఏడాది 2021 ఏప్రిల్ 30న ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఆ తరువాత పెద్ద చిత్రాలు దండయాత్ర మొదలైంది. ఆ తరువాత పాన్ ఇండియా చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేయడం మొదలైంది. అయినా ఈ సినిమా ఇంకా రిలీజ్ కావడం లేదని ఈ చిత్రంపై గత కొన్ని నెలలుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని, ఇప్పటికే సోనిలివ్ ఓటీటీకి సినిమాని అమ్మేశారని, ఇక ఈ మూవీ థియేటర్లో రిలీజ్ కావడం కష్టమేనని, డైరెక్ట్ సోనీ లివ్ లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానుందని, నక్సలిజం నేపథ్యమే ఈ సినిమాకు ప్రధాన ఆటంకంగా మారిందని రకరకాలుగా వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నిటికీ చెక్ పెట్టబోతోంది చిత్ర బృందం. ఫైనల్ గా శుక్రవారం రిలీజ్ అప్ డేట్ ఇస్తున్నామంటూ ఓ పోస్టర్ ని విడుదల చేసింది.
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ చిత్ర రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్ ఇవ్వబోతున్నామని ప్రకటించి ఈ మూవీపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో చుట్టూ దళం వుండగా మధ్యలో గన్ పట్టుకుని సాయి పల్లవిని తలపించేలా ఓ యువతి కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. రవన్న (రానా) రచనలకు వీరాభిమానిగా మారి అతన్ని వెతుక్కుంటూ అడివికి వెళ్లిన యువతిగా ఇందులో సాయి పల్లవి నటించింది. జరీనా వాహెబ్, నందితా దాస్, ఈశ్వరీరావు, నివేదా పేతురాజ్, సాయి చంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.