టాలీవుడ్ లో గత కొంతకాలంగా టికెట్ ధరల గురించే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. కరోనా పాండమిక్ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన ఫిలిం మేకర్స్.. తక్కువ టికెట్ రేట్లతో మరింత నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ధరలు పెంచుకోడానికి ప్రభుత్వాల నుంచి అనుమతి తెచ్చుకున్నాయి.
అయితే పాండమిక్ తర్వాత కొత్త జీవోల ప్రకారం నిర్ణయించిన టికెట్ రేట్లు అన్ని సినిమాలకు వర్కవుట్ అవడం లేదని అర్థం అవుతోంది. అధిక టికెట్ ధరల కారణంగా జనాలు థియేటర్ల వైపు చూడటం తగ్గించారు. ఫలితంగా క్రేజీ చిత్రాలకు కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రావడం లేదు.
కరోనా టైంలో వినోదం కోసం ఓటీటీలను ఆశ్రయించిన ప్రేక్షకులు.. వాటికే అలవాటు పడిపోయారు. అంత రేటు పెట్టి థియేటర్లకు వెళ్లి చూడటానికి ఆసక్తి చూపడం లేదు. ఎలాగూ మూడు నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా.. అప్పుడు చూద్దాంలే అనే ధోరణిలో ఉంటున్నారు.
ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా పసిగట్టిన ఫిలిం మేకర్స్.. ఇప్పుడు తమ సినిమాలకు ధరలు తగ్గించామని.. సాధారణ రేట్లకే సినిమా చూపిస్తామని ప్రకటిస్తున్నారు. నేడే చూడండి.. మీ అభిమాన థియేటర్లలో.. తగ్గింపు టికెట్ ధరలతో అంటూ పోస్టర్లతో ప్రచారం చేసుకుంటున్నారు. దీన్ని బట్టే టికెట్ల ధరలు ఏ స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించాయో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల విడుదలైన 'మేజర్' 'విక్రమ్' లాంటి సినిమాలను తక్కువ టికెట్ రేట్లతోనే రిలీజ్ చేశారు. ఇది ఈ చిత్రాలకు బాగా ప్లస్ అయింది. రిపీట్ ఆడియన్స్ రావడంతో మంచి వసూళ్ళు సాధించాయి. ఆయితే అంతకముందు రిలీజైన 'ఎఫ్ 3' చిత్రానికి.. గత శుక్రవారం (జూన్ 27) వచ్చిన 'అంటే సుందరానికి' సినిమాకి మాత్రం కాస్త ఎక్కువ రేట్లనే పెట్టారు. అదే ఈ రెండు సినిమాల వసూళ్లపై ప్రభావం చూపిందనేది స్పష్టమైంది.
ఈ నేపథ్యంలో వచ్చే వారం విడుదల కాబోతున్న ''విరాటపర్వం'' చిత్రానికి మామూలు టికెట్ ధరలతో రిలీజ్ చేయడానికి నిశ్చయించుకున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 150 - మల్టీఫ్లెక్స్ లలో రూ. 200 ఉండేలా రేట్లు నిర్ణయించారు. టాక్ బాగుంటే ఇది కచ్చితంగా ఈ సినిమాకు మేలు చేకూర్చే అవకాశం ఉంది.
దగ్గుబాటి రానా - సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''విరాటపర్వం''. 1990స్ వాస్తవ సంఘటనల ప్రేరణతో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని రూపొందించారు. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.