సక్సెస్ ఫుల్ కమర్షియల్ కథని చేయడం కంటే ఒక ప్రయోగాత్మకమైన కథను చేసి రిజల్ట్ తో సంబంధం లేకుండా మంచి గుర్తింపు తెచ్చుకోవడం బెటర్ అనే విషయం అందరి హీరోలకు తెలియదు. కొంత మందికి అలాంటి ఆలోచన వచ్చినా కూడా ఎందుకో నచ్చదు. కానీ అందరికంటే డిఫెరెంట్ గా టాలీవుడ్ లో మాణిక్యంలాంటి హీరో అనేలా సినిమాలను చేస్తున్నాడు రానా. అంతే కాకుండా తన మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నాడు.
బాలీవుడ్ లో కూడా రానా స్పెషల్ క్యారెక్టర్స్ తో రానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కమర్షియల్ కథలకంటే రానా ప్రయోగాత్మకమైన కథలనే ఎక్కువగా చేస్తాను అని సోషల్ మీడియా ద్వారా అందరికి అర్థమయ్యేలా చెప్పాడు. ముఖ్యంగా దేశభక్తి సినిమాలంటే తనకు చాలా ఇష్టమని అలాంటి కథలంటే తనకు చెప్పవచ్చని తెలియజేశాడు. లీడర్ - ఘాజీ - నేనే రాజు నేనే మంత్రి సినిమాలు దేశభక్తి సంస్కరణల వంటి విషయాలకు అర్ధం చెప్పాయి. ఆ మూవీస్ నా హృదయానికి బాగా దగ్గరయ్యాయి. అలాంటి సినిమాలను మరిన్ని చేయాలని అనుకుంటున్నా.
దేశభక్తి కి సంబందించి మంచి సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అనుకుంటున్నారా?? అయితే ఆ తరహా కథలు మీ దగ్గర ఉంటే నాకు చెప్పండని రానా వివరణ ఇవ్వడం నిజంగా చాలా మంచి ఆలోచన అని నెటిజన్స్ ప్రశంసలను అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం రానా తనకు నచ్చిన అలాంటి కథలోనే నటిస్తున్నాడు. 1945 అనే సినిమాను చేస్తున్నాడు. తెలుగు తమిళ్ లో తెరకెక్కుతోన్న ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.