బాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ ''బ్రహ్మాస్త్ర'' కోసం హిందీ ప్రేక్షకులతో పాటుగా సౌత్ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రణబీర్ కపూర్ - అమితాబ్ బచ్చన్ - అక్కినేని నాగార్జున - ఆలియాభట్ - మౌనీ రాయ్ తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ఇది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సౌత్ ఇండియాలో అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు.
''బ్రహ్మాస్త్రం పార్ట్ వన్: శివ'' చిత్రాన్ని 2022 సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్ - రాజమౌళి మరియు అయాన్ ముఖర్జీ మంగళవారం విశాఖపట్నంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. మెలొడీ థియేటర్ వేదికగా జరిగిన ఈ మీట్ కు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ.. ''సౌత్ ఇండియన్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. రజనీకాంత్ - కమల్ హాసన్ - చిరంజీవి - పవన్ కల్యాణ్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్.. ఇలా అందరిని నటనను ఇష్టపడతాను. ఇక్కడి హీరోలందరూ గొప్పవారే. ఒకరి పేరు చెప్పమంటే మాత్రం నేను ప్రభాస్ పేరు చెబుతాను. నేను నా డార్లింగ్ ప్రభాస్ ని చాలా ఇష్టపడతాను. అతను నాకు ఎంతో ప్రియమైన స్నేహితుడు'' అని తెలిపారు.
''నాపై ఇంత ప్రేమాభిమానాలను చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా హోమ్ టౌన్ లోనూ ఇంతటి ఆదరణను నేను చూడలేదు. మీ అందరికీ కృతజ్ఞతలు. పండగలాంటి ఈ వాతావరణాన్ని చూసి భవిష్యత్తులో తమ చిత్రాలను ప్రమోట్ చేసేందుకు చాలామంది బాలీవుడ్ యాక్టర్స్ వైజాగ్ కు వస్తారు'' అని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆయాన్ ముఖర్జీ మాట్లాడుతూ.. ''ఈరోజు నాకెంతో స్పెషల్. నేను తెరకెక్కించిన 'యే జవానీ హే దీవానీ' చిత్రం తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున రిలీజ్ అయింది. ఆ తర్వాత నేను 'బ్రహ్మాస్త్ర' సినిమా కోసమే వర్క్ చేస్తున్నా. భారతీయ సంస్కృతిని నేను ఎంతగానో గౌరవిస్తాను. భారతీయ మూలాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాను" అని అన్నారు.
కేవలం ముఖకవళికలతోనే హావభావాలతో అందరినీ మెప్పించగలిగే నటుల్లో రణబీర్ కపూర్ ఒకరిని రాజమౌళి కొనియాడారు. ఇటీవల రణబీర్ గురించి ఓ విషయం తెలిసి షాక్ అయ్యానని.. అతను కథ వినకుండానే మనిషిని చూసి సినిమాను ఓకే చేస్తాడని జక్కన్న చెప్పుకొచ్చారు.
ఇకపోతే 'బ్రహ్మాస్త్రం: శివ' ట్రైలర్ ను జూన్ 15న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ గ్లిమ్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.