తండ్రి ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటించిన రణబీర్

Update: 2020-05-03 11:10 GMT
బాలీవుడ్ స్టార్ న‌టుడు రిషి క‌పూర్ మ‌ర‌ణం ఆయ‌న కుటుంబానికే కాదు యావ‌త్ సినీ ప్ర‌పంచానికే తీర‌ని లోటు. ఆయ‌న ముంబైలోని ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. రిషి కపూర్‌ గత కొన్నేళ్లుగా లుకేమియాతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లో క్యాన్సర్‌ చికిత్స పొందిన రిషి కపూర్‌ కొన్ని రోజుల క్రితం స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కుమారుడు రణబీర్ - భార్య నీతూ సింగ్ - రణధీర్‌ కపూర్ - రాజీవ్‌ కపూర్ - సైఫ్‌ అలీఖాన్ - కరీనా కపూర్ - అభిషేక్‌ బచ్చన్ - ఆలియా భట్ లు దగ్గరుండి జరిపించారు. లాక్‌ డౌన్ కారణంగా రిషి కపూర్ అంత్యక్రియలకు రిద్దికపూర్ చేరుకోలేకపోవడం బాధాకరమనే చెప్పాలి. తండ్రి రిషి కపూర్‌ ను చివరి చూపుకు కూడా నోచుకొని కూతురు రిద్దిమా కపూర్ శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ముంబై చేరుకొన్నారు. రిషి కపూర్‌ కు శ్రద్దాంజలి ఘటించే ప్రార్థనా కార్యక్రమం శనివారం ముంబైలో కుటుంబ సభ్యుల కన్నీటితో కూడిన బాధల మధ్య జరిగింది. ఆయన ఆత్మకు శాంతి కలిగించేలా శనివారం కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ కార్యక్రమంలో అందరూ భావోద్వేగంలో మునిగిపోయారు. రిషి ఫోటోకు దండలు వేసి భార్య నీతూ సింగ్ - కుమారుడు రణ్‌ బీర్ కపూర్ ఉన్న ఫోటో అభిమానులను మరింత ఎమోషనల్‌ గా మార్చింది. రణ్‌ బీర్ కాషాయపు రంగు తలపాగా చుట్టుకొని.. నుదుట ఎర్రటి తిలకం దిద్దుకొని భావోద్వేగంగా కనిపించారు. రిషి కపూర్ మరణం నేపథ్యంలో ఆదివారం కూడా పూజా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు సన్నిహితులు పాల్గొంటారని సమాచారం. లక్షలాది అభిమానులను కన్నీటి సాగరంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిన అలానటి రొమాంటిక్ హీరో రిషి కపూర్ మరణ విషాదం ఇంకా అందర్నీ వెంటాడుతూనే ఉంది.
Tags:    

Similar News