రూ.150 కోట్ల సినిమా ఫ్లాప్ కి హీరో గడ్డం కారణం!

Update: 2022-12-10 07:50 GMT
బాలీవుడ్‌ స్టార్‌ రణబీర్ కపూర్‌ హీరో రెగ్యులర్‌ లవర్ బాయ్ ఇమేజ్ నుండి బయట పడటం కోసం చేసిన సినిమా 'షంషేరా'. తన యొక్క సినిమాల ఎంపిక విధానం మార్చుకుని మరింత మంది అభిమానులకు చేరువ అవ్వాలని భావించిన రణబీర్ కపూర్‌ తన రెగ్యులర్‌ అభిమానులను కూడా సంతృప్తిపర్చలేక పోయాడు.

షంషేరా సినిమా 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ తో రూపొందింది. ఆ సినిమా లో రణబీర్‌ కపూర్‌ ద్వి పాత్రాభినయం చేసిన విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ సమయంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. సినిమా విడుదల సమయంలో చేసిన పబ్లిసిటీతో కచ్చితంగా ఈ సినిమా వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తుందని అంతా భావించారు. కానీ అంతా రివర్స్ అయ్యింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. సినిమా మినిమం కలెక్షన్స్ వసూళ్లు చేయకపోవడంతో నిర్మాతలు భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. తాజాగా ఆ సినిమా గురించి రణబీర్ కపూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా ఫ్లాప్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఆయన వెళ్లడించాడు.

రణబీర్ కపూర్‌ మాట్లాడుతూ.. షంషేరా సినిమా ఫెయిల్‌ కావడానికి మేము చేసిన పొరపాట్లు కూడా కారణం. వాటిల్లో ఒకటి నా గడ్డం. సినిమాలోని నా పాత్ర కోసం గడ్డం ను పెట్టుకున్నాను.

ఎండలో షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఆ గడ్డం అతికించిందిగా క్లీయర్ గా కనిపిస్తుంది. ముఖంపై ఉన్న గడ్డం అసహజంగా అనిపించింది అందుకే మా సినిమా హిట్ అవ్వలేదని రణబీర్‌ కపూర్‌ అన్నాడు.

150 కోట్ల సినిమా కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఫెయిల్‌ అయ్యిందని రణబీర్ కపూర్ పేర్కొన్నాడు. కథ విషయంలో కూడా విమర్శలు వ్యక్తం అయ్యాయి. హీరోయిన్ మరియు నటీ నటుల ఎంపిక విషయంలో కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు అంటూ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News