రణబీర్ కపూర్-అలియా భట్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణేతో బ్రేకప్ తర్వాత రణబీర్ అలియాకి దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆ ఇద్దరూ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారు. కానీ లవ్ లో ఉన్నట్లు ఏనాడు అధికారికంగా ప్రకటించడలేదు. వాళ్లిద్దరి సాన్నిహిత్యం ప్రవర్తన తీరును బట్టి మీడియా బట్ట బయలు చేసింది తప్ప ఆ జంట ఏనాడూ రివీల్ చేయలేదు. అయితే ఒకానొక సమయంలో ఇది బ్రేకప్ స్టోరీలాగే మిగిలిపోతుందని మీడియా కథనాలు అంతకంతకు హీటెక్కించాయి. రణబీర్ డబుల్ గేమ్ ఆడుతున్నాడని అలియాతో పాటు..మరో నటితో కూడా సన్నిహితంగా ఉంటున్నాడని..ఆ సంగతి అలియాకి ఎంత మాత్రం నచ్చలేదని...ఆ కారణంగా దూరం జరుగుతుందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది.
అయితే తాజాగా వాటన్నింటికి ఈ జంట పుల్ స్టాప్ పెట్టేసింది. దివాళీ పండుగ సందర్భంగా ఇద్దరు ఎంతో సన్నిహితంగా మెలిగిన విధానమే అందుకు సాక్ష్యంగా నిలిచింది. దీనికి తోడు అలియా కొన్ని ఆసక్తికర పోస్టులతోనూ ఇద్దరి మధ్య ప్రేమాయణాన్ని ఖరారు చేసినట్లు అయింది. `జీవితంలో కొంత కాంతి..హ్యాపీ దివాళీ` అంటూ శుబాకాక్షలు తెలిపింది. ఆ తర్వాత వెంటనే అలియా రణబీర్ ని ఘాడంగ కౌగిలించుకున్న ఫోటోని చేసింది. సరిగ్గా పండుగ రోజు అలియా ఇలాంటి పోస్టులు పెట్టడంతో ఇద్దరి మధ్య ప్రేమని అధికారికంగా చెప్పినట్లు అయింది. ఇప్పటివరకూ చాటు మాటుగా షికార్లు చేసి బహిరంగంగా చెప్పేందుకు ఆలోచించిన జంట ఇకపై అన్నిటినీ అధికారికంగానే బహిర్గతం చేయడానికి ఓ హింట్ ఇచ్చినట్లు అయింది.
రణబీర్-అలియా దీపావళి సెలబ్రేషన్స్ లో నీలి రంగు వస్త్రాల్లో మెరిసారు. ఈ జంటను ఇలా చూసి జాక్వెలిన్ పెర్నాండేజ్..జోయా అక్తర్.. అనైతా ష్రాప్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆసక్తికర పోస్టులు పెట్టారు. లవ్ బర్స్డ్ కి ఆల్ ది బెస్ట్ అనే మాటను చెప్పకనే చెప్పారు. దీంతో ఈ జంట పెళ్లి పీటలెక్కడానికి ఇంకెంతో సమయం పట్టదని ఊహాగానాలు సాగుతున్నాయి. రణబీర్ కి వీలైంత త్వరగా పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రణబీర్-అలియా వేర్వేరు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. సాధ్యమైనంత తొందర్లోనే బ్యాండ్ భాజా మోగేదెపుడో చెబుతారేమో చూడాలి.