ఆ మధ్య ‘అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ’ అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో రణబీర్ కపూర్-కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లు. అందులో వాళ్లిద్దరి కెమిస్ట్రీ చూసి బెస్ట్ రొమాంటిక్ పెయిర్ అని బిరుదిచ్చేశారు బాలీవుడ్ జనాలు. అప్పుడప్పుడే ప్రేమలో పడుతున్న ఆ జంట అంత బాగా తెరమీద రొమాన్స్ పండించింది. కానీ ఇప్పుడు అదే జంట మధ్య కెమిస్ట్రీ ఏమాత్రం వర్కవుట్ కావట్లేదని ఫీలైపోతున్నాడు దర్శకుడు అనురాగ్ బసు. ఆయన దర్శకత్వంలో ‘జగ్గా జాసూస్’ సినిమాలో రణబీర్-కత్రినాలే హీరో హీరోయిన్లు. ఐతే ఈ సినిమా మొదలయ్యేటప్పటికి అంతా బాగానే ఉంది. అప్పటికి వాళ్లిద్దరూ గాఢమైన ప్రేమ బంధంలో ఉన్నారు. కొంత షూటింగ్ అయ్యేవరకూ బాగానే గడిచిపోయింది.
కానీ సినిమా మధ్యలో ఉండగా ఇద్దరికీ విభేదాలొచ్చాయి. బ్రేకప్ చెప్పేసి ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ఐతే ఇంతకుముందు దీపికాతో విడిపోయాక కూడా ‘తమాషా’ సినిమాలో చక్కగా రొమాన్స్ పండించాడు రణబీర్. కత్రినా కూడా సల్మాన్ ఖాన్ నుంచి విడిపోయి వచ్చేశాక మళ్లీ అతడితో ‘ఏక్ థా టైగర్’లో ఏ ఇబ్బంది లేకుండా నటించింది. ఐతే ఇప్పుడు ‘జగ్గా జాసూస్’ విషయంలో మాత్రం ఇద్దరూ సర్దుకుపోవట్లేదట. సెట్లో చాలా ముభావంగా ఉంటూ మొక్కుబడిగా సన్నివేశాలు చేస్తున్నారట. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో ఏమాత్రం కెమిస్ట్రీ లేకపోవడంతో డూప్ లను పెట్టి సీన్స్ పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తోందని వాపోతున్నాడట అనురాగ్ బసు. రణబీర్-కత్రినా లాంటి పెద్ద తారలు వ్యక్తిగత విషయాల్ని పక్కనబెట్టి ప్రొఫెషనల్ గా లేకుండా ఇలా వ్యవహరించడం పట్ల అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. వీళ్లిద్దరికీ ఇది న్యాయమా.. రొమాంటిక్ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ పండకపోతే కష్టమని.. సినిమా ఫలితమే తేడా వచ్చేస్తుందని ఫీలవుతున్నాడట. తమ వ్యక్తిగత విభేదాల్ని సినిమా మీద రుద్ది పాడు చేయడం న్యాయమా అన్నది రణబీర్.. కత్రినాలే ఆలోచించుకోవాలి.