ప్రయోగాలకు ఇది సమయం కాదు గురూ.. ఇదే సాక్ష్యం!

Update: 2022-07-24 06:40 GMT
బాలీవుడ్‌ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత రెండున్నర సంవత్సరాలుగా అంటే కరోనా షురూ అయినప్పటి నుంచి బాలీవుడ్ కష్టాల కడలి ఈదుతోంది. ఈ రెండున్నర ఏళ్లలో థియేటర్ల ద్వారా విడుదల అయిన సినిమాల్లో ఎన్ని విజయాలు సాధించాయి అంటే వేళ్ల మీద లెక్కించవచ్చు. ఎన్ని బ్లాక్ బస్టర్ విజయాలను దక్కించుకున్నాయంటే లేవనే చెప్పాలి.

అదే బాలీవుడ్ లో కొన్ని సౌత్‌ సినిమా లు వందల కోట్లు వసూళ్లు రాబట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో రణబీర్ కపూర్ తన ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టి విభిన్నమైన కథ కథనం అంటూ షంషేరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రణబీర్ కపూర్‌ తో పాటు ఈ సినిమా లో సంజయ్ దత్‌ కీలక పాత్రలో నటించడంతో అంచనాలు పెరిగాయి.

రణబీర్ కపూర్ సినిమా అంటే రొమాంటిక్ కమ్‌ లవ్‌ ను ప్రేక్షకులు ఆశిస్తారు. కాని షంషేరా ప్రేక్షకుల మరియు రణబీర్‌ కపూర్‌ అభిమానుల అంచనాలు తలకిందులు అయ్యేలా చేసింది. హీరోగా రణబీర్ కపూర్‌ చేసిన గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉండటంతో ఆయన అభిమానులు అంగీకరించలేక పోతున్నారు. కథ రణబీర్ కపూర్ కు సెట్‌ అవ్వక పోగా.. జనాలకు నచ్చే స్టోరీ కాదని రివ్యూలు వచ్చాయి.

అసలే బాలీవుడ్‌ ప్రేక్షకులు హిందీ సినిమాలను చూసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు ప్రయోగాలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ సినీ విశ్లేషకులు రణబీర్ కపూర్‌ ను ప్రశ్నిస్తున్నారు. షంషేరా ఫలితం తో రణబీర్ కపూర్ తదుపరి సినిమా విషయంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇటీవలే రణబీర్ కపూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రెగ్యులర్‌ లవ్‌ కమ్‌ రొమాంటిక్ సినిమాలు చూసి బోర్ కొట్టింది. అందుకే కొత్తగా ప్రయత్నించాలని షంషేరా సినిమాను కమిట్‌ అయ్యాను అన్నాడు. తన నుంచి ఇక మీదట బ్యాక్ టు బ్యాక్ విభిన్నమైన సినిమాలే వస్తాయి అన్నట్లుగా మరో ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆయన అన్నట్లుగానే రొటీన్‌ సినిమాలు కనుక రాకుంటే బ్యాక్ టు బ్యాక్ షంషేరా ఫలితాలు తప్పవేమో అంటున్నారు.
Tags:    

Similar News