మాజీ లవర్ల సెల్ఫీ భలేగుందే!!

Update: 2017-04-29 11:38 GMT
దాదాపు ఒక సంవత్సరం క్రితం.. అదిగో ఇంకేముంది పెళ్ళి చేసుకోబోతున్నారు అనే న్యూస్ వచ్చేసింది. కాని అంతోలనే కత్రినా కైఫ్‌ తో ప్లేబాయ్ హీరో రణబీర్ కపూర్ విడిపోయినట్లు వార్తలు వచ్చేశాయి. కొన్నాళ్ళకు రణబీర్ అండ్ కత్రినా తాము కలసి కట్టుకున్న ఫ్లాట్ నుండి బయటకు వచ్చేసి విడిగా ఉండటంతో.. ఇదంతా నిజమే అని కూడా తెలిసిపోయింది. అయితే ఇప్పుడు ఈ మాజీ లవ్వర్లు మరోసారి కలసి సెల్ఫీ దిగారు తెలుసా.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తనదైన బికినీ రూటులో నానా హంగామా చేస్తోంది. ఇప్పుడు ఇదిగో రణబీర్ తో ఒక సెల్ఫీ కూడా దిగేసి.. దానిని తన పి.ఆర్. టీమ్ ద్వారా షేర్ చేయించింది. ఇంతకీ మ్యాటర్ ఏంటి గురూ? నిజానికి ''జగ్గా జస్సూస్'' అనే సినిమాలో రణబీర్ అండ్ కత్రినా జంటగా నటించారు. అనురాగ్ బసు రూపొందించిన ఈ సినిమా త్వరలోనే విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆ సినిమాను వివిధ ఛానళ్లలో వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. ఆ సందర్బంగా ఈ హాట్ కపుల్.. ఎలియాస్ మాజీ లవర్స్ ఇలా ఫోజులు ఇచ్చారు.

ఏదేమైనా కూడా బాలీవుడ్ లో ప్రేమాయణాలు బెడసి కొట్టడం.. తిరిగి ఆ లవ్వర్లు కలసి సినిమాల్లో నటించడం.. ఇవన్నీ సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు చూస్తుంటే కత్రినా అండ్ రణబీర్ కూడా అందుకు అతీతం కాదనే అనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News