కపూర్ ఫ్యామిలీ హీరో అంటే ఆమాత్రం ఉండదా!

Update: 2022-11-10 00:30 GMT
బాలీవుడ్‌ లో కపూర్ ఫ్యామిలీకి చెందిన వారు ఎంతో మంది ఉన్నారు. రాజ్‌ కపూర్ వారసత్వంగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వారు ఎంతో మంది. రాజ్ కపూర్‌ తనయుడు రిషి కపూర్ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం పాటు స్టార్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. పాకిస్తాన్‌ తో సహా ఇండియాలో చాలా చోట్ల రాజ్ కపూర్ మరియు రిషి కపూర్ లకు ఆస్తులు ఉన్నాయట.

ఇప్పుడు రిషి కపూర్ వారసుడు యంగ్‌ హీరో రణబీర్ కపూర్‌ బాలీవుడ్‌ లో అత్యధిక ఆస్తి కలిగి ఉన్న హీరోల జాబితాలో నిలిచాడు. తాజాగా ఒక బాలీవుడ్ మీడియా సంస్థ ప్రచురించిన కథనం అనుసారంగా రణబీర్ కపూర్ యొక్క ఆస్తి నికర విలువ 337 కోట్లుగా తెలుస్తోంది.

30 కోట్ల రూపాయల విలువ చేసే అపార్ట్‌మెంట్‌ తో పాటు కోట్లాది విలువ చేసే కార్లు కూడా ఆయన కలిగి ఉన్నాడు. ముంబయిలో ఖరీదైన ఆస్తులను కలిగి ఉన్న రణబీర్‌ కపూర్ ఇటీవల తన భార్య ఆలియా భట్ ఆస్తులను తన ఆస్తులతో కలుపుకుని టాప్ 10 లో నిలిచాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల మాట.

ఇటీవలే తండ్రి అయిన రణబీర్ కపూర్‌ తన వారసులకు వందల కోట్ల ఆస్తులను ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా రణబీర్ కపూర్ ఉన్నాడు. కనుక ముందు ముందు రణబీర్ కపూర్‌ ఆస్తుల విలువ రెట్టింపు అయినా ఆశ్చర్యం లేదు అంటూ మీడియా కథనం లో పేర్కొనడం జరిగింది.

రణబీర్ కపూర్‌ ప్రస్తుతం సినిమాల్లో మాత్రమే కాకుండా అర డజను కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అందుకు గాను రణబీర్ కపూర్‌ ఏడాదికి పదుల కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకోబోతున్నాడు. మొత్తానికి రణబీర్ కపూర్ ఆస్తులు ఏడాది ఏడాదికి పెరుగుతూనే ఉన్నాయి. కపూర్‌ ఫ్యామిలీ అంటే ఈ మాత్రం ఆస్తులు ఉండవా అంటూ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News