హీరో-దర్శకుల మధ్య సాన్నిహిత్యం ఉంటేనే సినిమా బాగా తెరకెక్కుతుంది. అన్ని శాఖలతో కలివిడిగా తిరిగేవాడే హీరోగా రాణించగలడన్నది సత్యం. అలాంటి చాకచక్యం, చాణక్యం ఉన్నవాడు కాబట్టే కుర్రహీరో రణబీర్ కపూర్ లవర్‌బోయ్‌గా రాణించాడు. చాలా తక్కువ టైమ్‌లో బాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఆవిర్భవించాడు.
అనురాగ్ కశ్యప్ వంటి స్టార్ డైరెక్టర్ నేతృత్వంలో ఇప్పటికే రెండు సినిమాల్లో నటించేశాడు. తాజాగా అనురాగ్ దర్శకత్వంలో 'బాంబే వెల్వెట్' అనే చిత్రంలో నటించాడు. అయితే ఈ సినిమా ప్రచారానికి రణబీర్ డుమ్మా కొట్టేస్తున్నాడని సమాచారం. ఎంకి చావు సుబ్బికొచ్చిందన్న చందంగా.. రణబీర్-కత్రిన ఎఫైర్ అనురాగ్ సినిమాని దెబ్బకొట్టేట్టే కనిపిస్తోంది. ఎలాగూ రిలీజ్ ప్రచారం మొదలైంది కాబట్టి రణబీర్ మీడియా ముందుకొచ్చి తన సినిమా గురించి ప్రచారం చేస్తాడులే అనుకున్నాడు దర్శకుడు. కానీ సీన్ రివర్సయ్యింది. మీడియా రణబీర్ వ్యక్తిగత జీవితం, ఎఫైర్ గురించి పదే పదే ప్రశ్నించి విసిగిస్తోందని ప్రచారానికే ఎగనామం పెట్టాడు. దాంతో దర్శకుడిలో పరేషాన్ మొదలైంది.
రణబీర్‌తో ఎంత సాన్నిహిత్యం ఉన్నా ప్రచారానికి రమ్మని పిలవలేకపోతున్నాడు. గతంలోనూ రాయ్ సినిమా ప్రచారం విషయంలో ఇలాగే చేశాడు రణబీర్. దాంతో ఈ కుర్రహీరోతో పెద్ద దర్శకులకు పెద్ద ఇక్కట్లు తప్పడం లేదు. అయ్యో పాపం అనురాగ్!!