‘తొలి ప్రేమ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించాడు. కమర్షియల్ గా బిగ్ హిట్ కాకున్నా కూడా అతడిపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో నమ్మకం అయితే ఏర్పడినది. తర్వాత సినిమాతో తప్పకుండా హిట్ కొడతాడని చాలా మంది అనుకున్నారు. అయితే వెంకీ రెండవ సినిమా ‘మిస్టర్ మజ్ను’ మాత్రం నిరాశ పర్చింది. కమర్షియల్ గా రెండవ సారైనా సక్సెస్ దక్కించుకుంటాడని అనుకుంటే మరోసారి మొదటి ఫలితాన్నే పునరావృతం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈయన రంగ్ దే సినిమా ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడు. భీష్మతో సక్సెస్ దక్కించుకున్న నితిన్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిన కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ అయిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ కారణంగా సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. హీరో హీరోయిన్ ఇంకా ప్రొడక్షన్ బ్యానర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి వెంకీ అట్లూరికి కమర్షియల్ సక్సెస్ దక్కడం ఖాయం అంటూ చాలా మంది విశ్లేషిస్తున్నారు.
మొదటి రెండు సినిమాలు కమర్షియల్ గా గొప్పగా ఆడక పోవడంతో ముందు ముందు కెరీర్ బాగుండాలంటే మూడవ సినిమా అయిన రంగ్ దే తప్పనిసరిగా బాగుండాలి. లేదంటే కెరీర్ లో వెంకీ అట్లూరి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్స్ రంగ్ దే సినిమా వెంకీ అట్లూరికి లైఫ్ అండ్ డెత్ అంటున్నారు. మరి ఈ లైఫ్ అండ్ డెత్ పరిస్థితుల్లో వెంకీ అట్లూరికి దక్కే ఫలితం ఏంటో చూడాలి.