తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న `వారీసు` రిలీజ్ కారణంగా వివాదంలో ఇరుక్కుంటే తొలిసారి హీరో విజయ్ ఈ మూవీ కోసం పాడిన పాట నెట్టింట ట్రెండ్ అవుతోంది. గత కొంత కాలంగా తెలుగు, తమిళ పాటలు నెట్టింట రిలీజ్ అయిన క్షణాల్లోనే మిలియన్ ల కొద్దీ వ్యూస్ ని రాబట్టేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని పాటలు 800 మిలియన్, 500 మిలియన్ లని క్రాస్ చేయడం ఇప్పడు సర్వసాధారణంగా మారింది.
బన్నీ నటించిన `అల వైకుంఠపురములో` మూవీలోని రెండు పాటు వందల మిలియన్ ల వ్యూస్ ని రాబట్టి ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. రాములో రాములా.. సాంగ్ 500 మిలియన్ లని క్రాస్ చేస్తే ఇదే మూవీలోని `బుట్టబోమ్మ .. సాంగ్ 800 మిలియన్ లని క్రాస్ చేసిన తొలి తెలుగు పాటగా నెట్టింట ట్రెండ్ అయింది. ఇక తమిళం నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు `రౌడీ బేబీ` సాంగ్ ని బీట్ చేసిన సాంగ్ ఇంత వరకు రాలేదని చెప్పొచ్చు.
ఈ పాట ఇప్పటి వరకు 1.4 బిలియన్ వ్యూస్ ని రాబట్టి సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఈ సాంగ్ లు సాధించిన రికార్డ్ వ్యూస్ తరువాత ప్రతీ సినిమా సాంగ్ రిలీజ్ చేసిన గంటల్లోనే మిలియన్ ల వ్యూస్ ని రాబట్టడం ఆనవాయితీగా మారింది. ఇదే తరహాలో రీసెంట్ గా విడుదల చేసిన `వారీసు`లోని ``రంజితమే` సాంగ్ నెట్టింట వైరల్ గా మారి ట్రెండింగ్ అవుతూ టాప్ 5లో నిలవడం విశేషం. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
గ్లోబల్ గా రేటింగ్ లో ఈ సాంగ్ పలు క్రేజీ ఆల్బమ్స్ తో పోటీపడుతూ 5వ స్థానంలో వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతుండటం విశేషం. ఎస్. ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ పాటని ఎం.ఎం. మానసితో కలిసి హీరో విజయ్ ఆలపించాడు. తొలిసారి విజయ్ పాడిన ఈ పాట గ్లోబల్ గా స్పాటిఫై చార్ట్ బస్టర్స్ లో ఫిఫ్త్ ప్లేస్ లో నిలవడం విశేషం. పాటలో కొత్తదనం, డ్యాన్స్ లో స్పెషల్ స్టెప్స్ అంటూ ఏమీ లేకపోయినా ఈ పాట టాప్ లో నిలవడం వెనక తమన్ సంగీతం కంటే విజయ్ అభిమానుల మేనిమా బలంగా ప్రభావం చూపినట్టుగా తెలుస్తోంది.
`క్రాక్`లోని ఓ పాట బీట్ నే తమన్ యాజిటీజ్ లేపేసినా.. ఓ మూవీలోని శివ కార్తికేయల స్టెప్పుల్ని కాపీ చేసినా వాటి ప్రభావం ఏమీ ఈ పాటపై పడకపోవడం గమనార్హం. ఇది విజయ్ ఫ్యాన్స్ కారణంగా ఈ పాటకు దక్కిన క్రేజ్ గా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.