RC15 లాంచ్: రెండు పిల‌క‌ల‌తో ర‌ణవీరుడి ఫిక‌రేంటో?

Update: 2021-09-09 11:30 GMT
ఒక పిల‌క వేస్తే నామోషీ.. అందుకే రెండు పిల‌క‌లు వేశాడు. సూటు బూటు ధ‌రించి పిల‌క‌ముడితో మ‌న‌సులు గెలిచాడు. ఇంత‌కీ ఎవ‌రాయ‌న‌? అంటే.. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్. పేరుకు త‌గ్గ‌ట్టే అత‌డిలో ఎన‌ర్జిటిక్ స్టైలిష్ యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్ కి తెలిసొచ్చింది. ఇన్నాళ్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. విజ‌య్ దేవ‌ర‌కొండ స్టైల్స్ గురించి ముచ్చ‌టించిన తెలుగు యువ‌త మెగాభిమానుల్లో ర‌ణ‌వీర్ హాట్ టాపిక్ అయ్యాడు.

ఈ బుధ‌వారం ఆర్.సి 15 లాంచ్ సంద‌ర్భంగా అత‌డు ఓ స్పెష‌ల్ లుక్ తో హైద‌రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగాడు. ర‌ణ‌వీర్ ని చూడ‌గానే విమానాశ్ర‌యంలో అంద‌రికీ మైండ్ బ్లాంక్ అయ్యింది. స్టైలిష్ సూట్ ధ‌రించిన అతడు ఇన్ వోర్ ఏదీ లేకుండా బంప్ అయ‌న‌ బేర్ చెస్ట్ (ఛాతీ)ని ఎలివేట్ చేస్తూ స‌రికొత్త లుక్ తో క‌నిపించాడు. ఇక అత‌డి హెయిర్ స్టైల్ ఇంకా పెద్ద స‌ర్ ప్రైజ్. ఒకటి కాదు రెండు పిల‌క‌లు మడి వేసి ర‌బ్బ‌ర్ బ్యాండ్ త‌గిలించిన అత‌డిని చూడ‌గానే సామాన్యులు ఫ్యాష‌న్ ప్రియులు అనే తేడా లేకుండా ఒక‌టే నోళ్లు నొక్కుకున్నారు.

అత‌డు హైద‌రాబాద్ లో ఆర్.సి 15 లాంచింగ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ప్పుడు అంద‌రి దృష్టి ఆ రెండు పిల‌క‌ల‌పైనే! ర‌ణ్ వీర్ లో ఎన‌ర్జీ అత‌డి ఆహార్యం ప్ర‌తిదీ మ‌న‌వాళ్ల‌కు కొత్త‌గానే క‌నిపించాయి. ఇక రామ్ చ‌ర‌ణ్ తో శంక‌ర్ తో అత‌డు మాట్లాడేప్పుడు ఆ వాల‌కం అత‌డి వైబ్రేంట్ అప్పియ‌రెన్స్ ప్ర‌త్యేకంగా ఫోటోల్లో హైలైట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ ఫోటోగ్రాఫ‌ర్లు ర‌ణ్ వీర్ ని వ‌దిలి వెళ్ల‌కుండా ఫ్లాష్ లు మెరిపించ‌డంతో ఇప్పుడు ఆ ఫోటోల‌న్నీ అంత‌ర్జాలంలో హాట్ డిబేట్ గా మారుతున్నాయి.

రణవీర్ సింగ్ తాజా పోనీటైల్ హెయిర్‌-డో వైరల్ గా దూసుకెళుతోంది. రణ్ వీర్ పిన్ స్ట్రిప్డ్ గ్రే బ్లేజర్ ప్యాంటు -షర్ట్ లెస్ కాంబోలో ఉబెర్-కూల్ లుక్ తో ఓ క‌నిపించారు. పద్మావత్ స్టార్ క‌ళ్లు చెదిరే లుక్ ఇది అంటూ ప్ర‌శంస‌లు కురిసాయి.

అంతేకాదు అతని కళ్లు చెదిరే హెయిర్ స్టైల్ పై అభిమానులు సోష‌ల్ మీడియా అనుచరులు తమ స్పందనలను వ్య‌క్తం చేశారు. గతంలో సినిమాల్లో ఇలాంటి చమత్కారమైన కేశాలంకరణను వీక్షించిన అభిమానుల‌కు ఇది డ‌బుల్ ట్రీట్ గా మారింది. ఇంత‌కుముందు శంక‌ర్ తెర‌కెక్కిచిన చిత్రాల్లో చియాన్ విక్ర‌మ్ ఈ త‌ర‌హా లుక్ తో క‌నిపించారు. అలాగే రామ్ చ‌ర‌ణ్ గోవిందుడు అంద‌రివాడేలే చిత్రంలో ఇలాంటి పిల‌క గెట‌ప్ తో ఆక‌ట్టుకున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. యంగ్ య‌మ ఎన్టీఆర్ సైతం ప‌లు చిత్రాల్లో పిల‌క గెట‌ప్ తో క‌నిపించారు.

ర‌ణ‌వీర్ సింగ్ ఇంత‌కుముందు గుండా (1998) చిత్రంలో నటుడు శక్తి కపూర్ పోనీ హెయిర్ స్టైల్ ను గుర్తు చేశాడ‌ని కొంద‌రు నెటిజ‌నులు వ్యాఖ్యానించారు. మరో సోషల్ మీడియా యూజర్ `చమత్కర్` (1992) నుండి షారూక్ పోనీ టెయిల్ లుక్ ని షేర్ చేసారు. దీనిలో అతను డబుల్ పోనీటెయిల్స్ .. ఫ్రంట్ బ్యాంగ్ లతో క‌నిపిస్తాడు.

రణ్ వీర్ సింగ్ ఫ్యాషన్ తో ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలు చేయడం రెగ్యుల‌ర్ గా చూసేదే. సాధారణంగా మూస లింగ నిబంధనలకు విరుద్ధంగా ఉండే దుస్తుల ఎంపిక‌తో ప్ర‌తిసారీ ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తున్నారు. రణ్ వీర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించే `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` లో అలియా భట్ తో కలిసి క‌నిపించ‌నున్నారు. అత‌డు న‌టించిన 83 చిత్రం విడుద‌ల కావాల్సి ఉంది.


Tags:    

Similar News