అలా స్టెప్పులేసిన దీప్-వీర్ జంట

Update: 2018-11-26 11:52 GMT
బాలీవుడ్ స్టార్స్ దీపీక పదుకొనె.. రణవీర్ సింగ్ ఇద్దరూ ఈమధ్యే పెళ్ళి చేసుకొని ఒకింటివారైన సంగతి తెలిసిందే.  నవంబర్ 14..15 తారీఖుల్లో ఇటలీ లోని లేక్ కోమో రిసార్టులో కొంకణీ సంప్రదాయంలో ఒకసారి.. సింధీ సంప్రదాయంలో మరోసారి పెళ్ళి చేసుకున్నారు.  నవంబర్ 21 న బెంగళూరులోని ది లీలా ప్యాలెస్ లో రిసెప్షన్ జరిగింది.   

ఇదిలా ఉంటే నవంబర్ 24 న రణవీర్ సింగ్ సోదరి రితిక భావ్నాని దీప్-వీర్ జంటకు గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఇచ్చిందట. ఈ పార్టీకి బంధువులతో పాటుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా హాజరయ్యారని సమచారం. ఇక ఈ పార్టీలో ఇద్దరూ తళుకుబెళుకుల దుస్తులు ధరించి బాలీవుడ్ హిట్ పాటలకు డ్యాన్స్ చేశారట. ఈ పార్టీలో రణవీర్ లుక్ ఇప్పటికే బయటకు వచ్చింది గానీ దీపిక ఎలాంటి డ్రెస్ లో కనిపించిందో తెలియదు.  తాజాగా రితిక భావ్నాని పార్టీలో దీప్-వీర్ ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది.   

ఈ పార్టీలో దీపిక ప్రముఖ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ డిజైన్ చేసిన లెహెంగాలో దర్శనమిచ్చింది.  ఫోటోలో రణవీర్ సింగ్ పంజాబీ స్టైల్లో బల్లె బల్లె అన్నట్టుగా చేతులు పైకెత్తి డ్యాన్స్ చేస్తుంటే.. దీపిక కూడా కలిసి డ్యాన్స్ చేస్తూ నవ్వుల్లో మునిగిపోయింది.  ఇదిలా ఉంటే దీప్-వీర్ పెళ్ళి పార్టీల హంగామా ఇంకా పూర్తి కాలేదు.   నవంబర్ 28 న ఫ్రెండ్స్.. మీడియాలోని ప్రముఖులకు రిసెప్షన్ ఇస్తున్నారట.  డిసెంబర్ 1న ఫిలిం ఇండస్ట్రీలోని కొలీగ్స్.. స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇస్తారట.  అంటే బల్లె బల్లే డ్యాన్స్ ఇంకా ఉందన్నమాట.  


Tags:    

Similar News