పద్మావత్ టైటిల్ రోల్ దీపికా పదుకొనే పోషించినప్పటికి సినిమా చూసి బయటి వస్తున్నప్పుడు మాత్రం ప్రేక్షకులను వెంటాడుతున్న పాత్ర అల్లాయుద్దిన్ ఖిల్జీ రూపంలో కనిపించిన రన్వీర్ సింగే. ఈ మధ్య కాలంలో ఒక హింది సినిమాలో ఇంత ప్రభావం చూపించిన విలన్ మరొకరు లేరు అనడం అతిశయోక్తి కాదు. కథా పరంగా దీపికాతో సమానమైన పాత్ర చేసిన షాహిద్ కపూర్ సైతం ఎవరికి గుర్తుకు రావడం లేదంటే అదంతా రన్వీర్ కపూర్ టాలెంట్ మహిమే. ఎంత యాక్టింగ్ అయినా కళ్ళకు కట్టినట్టు అప్పుడు ఖిల్జీ ఇలాగే ప్రవర్తించేవాడేమో అని అనిపించేలా రన్వీర్ చేసిన కనికట్టు అంతా ఇంతా కాదు. తాను ఇష్టపడిన రాణిని దక్కించుకోవడం కోసం ఎంతకైనా తెగించే దుర్మార్గమైన పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టం. కాని రన్వీర్ సింగ్ ఇది మనం అనుకున్నంత తేలిగ్గా చేయలేదు.
ఖిల్జీ పాత్రలో డెప్త్ ని అర్థం చేసుకోవడం కోసం, ఆ క్రూరత్వాన్ని తన కళ్ళల్లో, శరీరంలో కనిపించడం కోసం గుర్గావ్ లోని తన ఇంట్లో 21 రోజుల పాటు ఒంటరిగా గడిపాడు రన్వీర్. బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని ఎవరికి అందుబాటులో లేకుండా తనను తాను ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసుకున్న రన్వీర్ కు శూన్యతలోని ఘాడతను అర్థం చేసుకోవడం వల్లే అంత చెడ్డవాడి పాత్రను డైజెస్ట్ చేసుకున్నాడు. చీకటిని అర్థం చేసుకుంటే కామం - దుర్మార్గం - క్రోధం - కర్కశత్వం బాగా అలవడుతాయని అందుకే ఇంత రిస్క్ చేసి మరీ ఇలా కష్టపడాల్సి వచ్చిందని రన్వీర్ సింగ్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వివరించాడు.
అందుకే ఈ రోజు రన్వీర్ సింగ్ తన కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అందుకుంటున్నాడు. పద్మావత్ చూసిన చిన్న పిల్లలు - యువతులు తనను నేరుగా చూసేందుకు భయపడుతున్నారని, నటుడిగా ఇంతకంటే ఏం కావాలని గర్వంగా చెబుతున్న రన్వీర్ సింగ్ లో అసలు టాలెంట్ ని ప్రపంచానికి చాటి చెప్పింది సంజయ్ లీలా భన్సాలీనే. రామ్ లీలా - బాజీరావు మస్తాని - పద్మావత్ తర్వాత నాలుగో సినిమాకు కూడా ఈ ఇద్దరు జత కట్టడం కన్ఫర్మ్ అయినట్టే. సబ్జెక్టు ఏది అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.